Rashmika: నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈమె ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 7న విడుదల కాబోతున్న నేపథ్యంలో నేను ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులు కూడా పాల్గొని సందడి చేశారు అయితే ఈ కార్యక్రమంలో ఒక అభిమాని రష్మిక గురించి ఎంతో గొప్పగా మాట్లాడటమే కాకుండా మీరు మాత్రం పెళ్లి చేసుకోవద్దని, మీరు పెళ్లి చేసుకుంటే మేం చచ్చిపోతామంటూ ఏకంగా బెదిరింపులకు దిగారు. ఈ విధంగా అభిమాని రష్మిక పెళ్లి గురించి మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
రష్మిక నటించిన పుష్ప, యానిమల్, ఛావా సినిమాలు వరుస హిట్ సినిమాలతో మీరు ఇండియాని షేక్ చేస్తున్నారు. మీకు నాలాంటివారు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మీ నటన చూసి మీరు మాకు క్రష్ గా మారి క్రష్మిక అయ్యారు. మీ గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే ఎవరో ఒకరు మమ్మల్ని కొట్టేస్తారు. ఇక్కడున్న వారందరూ కూడా మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నారు అయితే మీరు మాత్రం దయచేసి పెళ్లి చేసుకోవద్దండి మీరు పెళ్లి చేసుకుంటే మాలాంటి ఎంతోమంది అభిమానులు చచ్చిపోతారు. దయచేసి మీరు పెళ్లి చేసుకోవద్దు మాకు ఎప్పటికీ కష్మికగానే ఉండిపోండి అంటూ అభిమాని అత్యుత్సాహం కనబరిచారు.
ఇలా రష్మికను పెళ్లి చేసుకోవద్దు అంటూ అభిమాని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే రష్మిక నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో నిశ్చితార్థం(Engagment) జరుపుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఈనెల 4వ తేదీ పెద్దల సమక్షంలో చాలా సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ రష్మిక ఎక్కడ చెప్పలేదు కానీ విజయ్ దేవరకొండ టీం మాత్రం క్లారిటీ ఇచ్చారు.
మరోసారి జంటగా..
వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకున్నారని 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపారు. అయితే పెళ్లి ఎప్పుడు ఏంటి అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు అయితే ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రష్మిక విజయ్ దేవరకొండ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. అయితే త్వరలోనే వీరిద్దరూ మరోసారి జంటగా వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వీరిద్దరూ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రవి కిరణ్ డైరెక్షన్ లో రౌడీ జనార్దన్ అనే సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.
Also Read: Allu Aravind: రష్మిక లాంటి కూతురు ఉంటే బాగుండు.. బన్నీ ఫాన్స్ కు షాక్ ఇచ్చిన అరవింద్!