Allu Aravind: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అల్లు అరవింద్(Allu Aravind) ఒకరు. గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈయన నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే గీత ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో రష్మిక(Rashmika), దీక్షిత్ శెట్టి (Deekshith Shetty)ప్రధాన పాత్రలలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా నవంబర్ 7వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో సినిమా పట్ల మంచి అంచనాలను కూడా పెంచేసింది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా కథను నటుడు రాహుల్ రవీంద్రన్ తనకు 2021 వ సంవత్సరంలోనే తెలిపారని, అయితే ఆహా కోసం ఒక సిరీస్ లాగా చేయాలని ప్లాన్ చేశారు. ఇది వెబ్ సిరీస్ కంటే కూడా సినిమాలాగైతే బాగుంటుందని నేను చెప్పాను. అప్పటినుంచి అతను ఎక్కడ కనపడిన ఆ కథ ఏం చేశావు అంటూ నేను అడిగేవాణ్ణి అని అరవింద్ తెలిపారు.
ఈ సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్ ను మోయగలిగే వాళ్ళు దొరకాలని ఎదురు చూసాం. ఆ క్యారెక్టర్ ను మోయగలిగే కెపాసిటీ రష్మికకు మాత్రమే ఉందని తెలిపారు. ఈ సినిమాలో రష్మిక ఎంత బాగా నటించింది అంటే తనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అంత అద్భుతంగా నటించిందని తెలిపారు. ఇలా రష్మికను చూస్తే కనుక నాకు ఇలాంటి కూతురు ఉంటే బాగుండేది అనిపిస్తుందని అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకుల అనే విషయం మనకు తెలిసిందే. గతంలో కూడా ఈయన సాయి పల్లవిని ఉద్దేశించి తను నా కూతురు లాంటిది అంటూ మాట్లాడారు.
విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి..
ఇక తాజాగా రష్మిక గురించి మాట్లాడుతూ ఇలాంటి కూతురు ఉంటే బాగుండేది అని మాట్లాడటంతో బన్నీ ఫాన్స్ ఒకసారిగా షాక్ అవుతున్నారు. ఇలా హీరోయిన్స్ అందరిని మీరు కూతుర్లుగా భావిస్తే ఎలా సార్.. మా అన్నకు హీరోయిన్లను దొరక్కుండా చేస్తారా? ఏంటి? అంటూ అల్లు అరవింద్ వ్యాఖ్యలపై బన్నీ ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడతానని అలాగే ఈ వేడుకకు విజయ్ దేవరకొండను(Vijay Devarakonda) ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తామని చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు కేకలు వేస్తూ గోల చేశారు. ఇక త్వరలోనే రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలోనే అల్లు అరవింద్ ఇలా మాట్లాడారని తెలుస్తోంది. మరి ఈయన చెప్పిన విధంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Rashmika: రౌడీ హీరోతో వ్యవహారం… స్టేజ్‌పై అఫీషియల్‌గా చెప్పేసిందిగా