టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా ఇవాళ మూడవ వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన నేపథ్యంలో టీమిండియా విజయం సాధించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ 105 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాపై తన తొమ్మిదవ సెంచరీని కూడా నమోదు చేసి, సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక తన అంతర్జాతీయ క్రికెట్ లో 3 ఫార్మాట్స్ లో కలిపి 50 సెంచరీలు కూడా పూర్తి చేశాడు.
ఈ నేపథ్యంలోనే అన్ని ఫార్మాట్స్ లో ఐదు కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ప్లేయర్ గా టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో 12 సెంచరీలు చేశాడు రోహిత్ శర్మ. అలాగే వన్డేల్లో 33 సెంచరీలు పూర్తి చేశాడు. ఇందులో ఆస్ట్రేలియాపైనే 9 వన్డే సెంచరీలు ఉన్నాయి. టీ20 క్రికెట్ లో 5 సెంచరీలు ఇప్పటికే పూర్తి చేసుకున్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇలా అంతర్జాతీయ క్రికెట్ లో 50 సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.
రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ మరోసారి చర్చకు రావడం జరిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దగ్గరుండి గెలిపించారు. ఈ మ్యాచ్ అనంతరం రవి శాస్త్రి తో రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు విచ్చేశారు. మేము మళ్ళీ వస్తాము లేదో తెలియదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడటం తనకు చాలా ఇష్టమని పేర్కొన్నాడు. మేము ఆస్ట్రేలియాకు తిరిగి వస్తాము లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో వీళ్లిద్దరూ రిటైర్మెంట్ తీసుకుంటారా? అని చర్చ మొదలైంది.