Reliance Meta AI Venture: రిలయన్స్ సంస్థ ఏఐ సేవలపై దృష్టి పెట్టింది. భారత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలను అభివృద్ధి చేయడానికి మెటా ప్లాట్‌ఫామ్స్, ఫేస్‌బుక్ ఓవర్సీస్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
రిలయన్స్ ఇంటెలిజెన్స్ ఏఐ వెంచర్ లో రూ.10 విలువ చేసే 2 మిలియన్ ఈక్విటీ షేర్లకు స్టార్టింగ్ సబ్‌స్క్రిప్షన్‌గా రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టింది. రిలయన్స్ ఇంటెలిజెన్స్ కంపెనీ రిలయన్స్ అనుబంధ సంస్థగా పనిచేస్తుందని తొలుత పేర్కొంది. అయితే మెటాతో జాయింట్ వెంచర్ ఒప్పందం చేసుకోవడంతో జాయింట్ వెంచర్ సంస్థగా మారింది.
ఏఐ జాయింట్ వెంచర్ లో రిలయన్స్ ఇంటెలిజెన్స్ 70 శాతం వాటాను కలిగి ఉండగా, మిగిలిన 30 శాతం వాటాను ఫేస్‌బుక్ కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం రెండు కంపెనీలు సుమారు రూ.855 కోట్ల పెట్టుబడిని పెట్టాయి. అయితే ఈ లావాదేవీలు పార్టీ లావాదేవీల పరిధిలోకి రాదని, రిలయన్స్ కంపెనీ ప్రమోటర్/ప్రమోటర్ గ్రూప్/గ్రూప్ కంపెనీలలో ఎవరికీ ఈ లావాదేవీలో సంబంధం లేదని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ రిలయన్స్ పేర్కొంది.
Also Read: LIC Denies Allegations: అదానీ సంస్థల్లో పెట్టుబడులు.. ప్రభుత్వ ఒత్తిళ్లపై క్లారిటీ ఇచ్చిన ఎల్ఐసీ
ఈ జాయింట్ వెంచర్ ఎంటర్‌ప్రైజ్ AI సొల్యూషన్స్‌పై దృష్టి సారించిందని రిలయన్స్ పేర్కొంది. నెక్ట్స్ జనరేషన్ డిజిటల్ టెక్నాలజీలపై రిలయన్స్ ఇంటెలిజెన్స్ పరిశోధన చేస్తుందని తెలిపింది. ఏఐ ఇంటెలిజెన్స్ అనేది ఎంటర్‌ప్రైజెస్ ఏఐ సర్వీసులను అభివృద్ధి, మార్కెట్, డిస్ట్రిబ్యూషన్ ను చేపట్టనుంది. రిలయన్స్, ఫేస్ బుక్ జేవీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గానీ, నియత్రణ సంస్థల నుంచి గానీ ఎలాంటి అనుమతులు అక్కర్లేదని రిలయన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.