E-Paper
Advertisement

Nagarjuna vs Venkatesh: 12 సార్లు బాక్సాఫీస్‌ వద్ద క్లాష్ అయిన నాగార్జున- వెంకటేష్‌.. ఎక్కువ సార్లు ఎవరు గెలిచారంటే…!

Nagarjuna vs Venkatesh: 12 సార్లు బాక్సాఫీస్‌ వద్ద క్లాష్ అయిన నాగార్జున- వెంకటేష్‌.. ఎక్కువ సార్లు ఎవరు గెలిచారంటే…!
Advertisement

Nagarjuna vs Venkatesh: టాలీవుడ్‌లో స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ క్లాష్‌లు ఎప్పటికీ ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి క్లాష్‌లలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి నాగార్జున అక్కినేని మరియు వెంకటేష్ దగ్గుబాటి మధ్య జరిగిన పోటీలు. ఇప్పటివరకు ఈ ఇద్దరు హీరోల సినిమాలు మొత్తం 12 సార్లు నేరుగా బాక్సాఫీస్ వద్ద ఢీ కొన్నాయి. మరి ఈ పోటీల్లో ఎక్కువ సార్లు ఎవరు గెలిచారు అనే విషయం ఇప్పుడు చూద్దాం.

1987లో మొదలైన ఈ క్లాష్ ప్రయాణం అంత సులభంగా మొదలుకాలేదు. నాగార్జున నటించిన అగ్ని పుత్రుడు, వెంకటేష్ నటించిన విజేత విక్రమ్ రెండూ ఫ్లాప్‌లుగా నిలిచాయి. అయితే 1989లో పరిస్థితి మారింది. నాగార్జున గీతాంజలి సూపర్ హిట్ అవగా, వెంకటేష్ ఒంటరి పోరాటం అవరేజ్‌గా నిలిచింది. అదే ఏడాది మరోసారి క్లాష్‌లో ప్రేమ అవరేజ్, విజయ్ ఫ్లాప్ అయ్యాయి.

తారు మారైన పరిస్థితి..!

Advertisement

1990లో వచ్చిన రెండు క్లాష్‌లలో మొదట రెండూ ఫ్లాప్‌లే అయినా, రెండోసారి వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి నాగార్జున ఇద్దరూ ఇద్దరేను పూర్తిగా మించిపోయింది. 1991లో ఇద్దరికీ నిరాశే ఎదురైంది. కానీ 1992లో వెంకటేష్ నటించిన చంటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి నాగార్జున కిల్లర్ కంటే భారీ విజయం సాధించింది.
1993లో ఇద్దరూ హిట్లు అందుకున్నారు. అల్లరి అల్లుడు సూపర్ హిట్‌గా నిలిచి అబ్బాయిగారును కొంత ముందుకు నెట్టింది. 1994లో మాత్రం ఎవరికీ పెద్ద విజయం దక్కలేదు. కానీ 1996లో వచ్చిన క్లాష్ మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. నాగార్జున నిన్నే పెళ్లాడతా ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ అవగా, వెంకటేష్ పవిత్ర బంధం కూడా సూపర్ హిట్‌గా నిలిచింది.
2010లో వెంకటేష్ రగడ అబవ్ అవరేజ్ సాధించగా, నాగార్జున నాగవల్లి అవరేజ్‌తో సరిపెట్టుకుంది. చివరిగా 2024లో వెంకటేష్ నా సామిరంగ హిట్ సాధించగా, నాగార్జున సైంధవ్ ఫ్లాప్ అయింది.

ఎవరిది పై చేయి..!

మొత్తం 12 క్లాష్‌లను చూసుకుంటే, వెంకటేష్‌కు బ్లాక్‌బస్టర్లు, ఇండస్ట్రీ హిట్‌లు ఎక్కువగా రావడం వల్ల బాక్సాఫీస్ పోటీలో స్వల్ప ఆధిక్యం ఆయనదే అని చెప్పొచ్చు. అయినా ఇద్దరూ టాలీవుడ్‌కు అమూల్యమైన నటులే. ఇక వచ్చే సంక్రాంతికి కూడా వీళ్ళిద్దరి సినిమాలు క్లాష్ అవుతున్నాయి. మరి ఈ రెండిట్లో ఏది విన్ అవుతుందో చూడాలి.

Advertisement

ALSO READ: Basha Producer: శోకసంద్రంలో సినీ ఇండస్ట్రీ.. బ్లాక్ బస్టర్ సినిమా నిర్మాత కన్నుమూత…!

Related News

నిర్మాత పివిపి సంచలన వ్యాఖ్యలు!.. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్‌కు కారణం?..

‘డాన్ 3’ వివాదం.. CCIని ఆశ్రయించనున్న రణవీర్ సింగ్ రాబోయే చిత్రాల నిర్మాతలు..

బుర్జ్ ఖలీఫాలో నివసించే గ్లోబల్ సెలబ్రిటీలు వీరే!.. సింగిల్ బెడ్ రూమ్ కాస్ట్ ఎంతో తెలుసా..

చిన్ననాటి మెమోరీస్ గుర్తుచేసేలా ‘సమ్మర్ హాలిడేస్’ టీజర్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి..

‘ఆయన్ని ప్రశాంతంగా బతకనివ్వండి’.. ఆ పుకార్లపై ఇళయరాజా తమ్ముడు ఫైర్!

‘ధురంధర్’ టెక్నీషియన్‌పై కేసు నమోదు.. అసలు ఏం జరిగిందంటే?

‘ఇరుముడి’ మాస్ మహారాజాకి కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందా?.. రిలీజ్‌ ప్లాన్ ఎప్పుడంటే?

టాలీవుడ్ నిర్మాతల షాకింగ్ నిర్ణయం.. సినిమాల పరిస్థితి ఏంటి..?

Big Stories

Advertisement
×