Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది అన్న ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి. ఒకప్పుడు నిర్మాతలు వరసగా స్టార్ హీరోల సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ ని తమ ఖాతాలో వేసుకునేవారు. కానీ ఈ మధ్య డిఫరెంట్ గా స్టోరీని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో తలకు మించిన భారం లాగా భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే అన్ని సినిమాలు సక్సెస్ అవుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. కొందరు డైరెక్టర్లు రూపొందించిన సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తున్నాయి. అయినా కూడా నిర్మాతల ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు కానీ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదు అంటూ నిర్మాతలు భారీగా బడ్జెట్ని కేటాయిస్తున్నారు. అయితే ఈ మధ్య జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది నిర్మాతలు ఇకమీదట ఇలానే సినిమాలు చేస్తారట అని తెలుస్తుంది.. అసలు నిర్మాతల ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రాల పరిస్థితి ఏంటి అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..
ఈమధ్య కాలంలో ఏ ఇండస్ట్రీ లోకి సంబంధించిన సినిమాలు ఆ ఇండస్ట్రీ వాళ్లే చూసేలా లేవు.. ఎందుకంటే ప్రస్తుతం ఏ సినిమా చూసినా కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతి సినిమా కూడా మంచి టాక్ ని అందుకుంటుంది అని చెప్పలేము.. అయినా కూడా నిర్మాతలు రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రస్తుతం ఇదే ట్రెండు నడుస్తుంది.. స్టార్ హీరోలు అందరూ కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తమ క్రేజ్ ని పెంచుకునేందుకు అలాంటి సినిమాలనే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే పరిస్థితి గనుక కొనసాగితే ఇకమీదట సోలో ప్రొడ్యూసర్లు కనిపించాలని తెలుస్తుంది.. భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు.. మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో సోలో ప్రొడ్యూసర్ సినిమాలు ఇకముందు ఉంటాయా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..
Also Read :హీరో రానా గురించి బయటపడ్డ భయంకర నిజం.. ఇది అస్సలు ఊహించిఉండరు..
కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తే.. మరికొన్ని సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ ని అందుకోవడంతో భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.. అయితే ఈ మధ్య నిర్మాతలు తెలివిగా ఆలోచిస్తున్నారు.. తమకు ఎటువంటి రిస్క్ లేకుండా ఉండేందుకు హీరోలతో టైప్ పెట్టుకుంటున్నారు.. హీరోలు కూడా సినిమాలకు ఎటువంటి నష్టాలు వచ్చినా కూడా ముందుండి ఆదుకుంటున్నారు.. ఇక ఈ మధ్య హీరోల ట్రెండ్ ఏంటంటే సినిమాకు రెమ్యూనరేషన్ కాకుండా పర్సంటేజ్ ను తీసుకుంటున్నారు.. సినిమాపై పెట్టుబడులు పెట్టడం కూడా కామన్ అయిపోయింది. ఈ పరిస్థితిని అధిగమించాలి అంటే కంటెంట్ పరంగా సినిమాలకు తక్కువ బడ్జెట్ ని కేటాయించుకునేలా రూపొందించుకోవాలి.. మరి ఇకముందు ఇదే పరిస్థితి గనుక కొనసాగితే కేవలం పాన్ ఇండియా చిత్రాలు మాత్రమే చూడాల్సి వస్తుంది.. అయితే స్టార్ హీరోలు మాత్రమే ఆ సినిమాలలో నటించాల్సిన పరిస్థితి.. మరి చిన్న హీరోల పరిస్థితి ఏమవుతుంది అన్నది ఆగమ్య గోచరంగా మారింది.. ఇకముందు ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తారో చూడాలి.. ఓటీటీ హవా తగ్గి తిరిగి థియేటర్లకు మంచి రోజులు రావొచ్చు… మరి నెక్స్ట్ సినిమాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్నది ఆసక్తిగా మారింది..