E-Paper
Advertisement

CM Revanth Reddy: లంబాడా తండాలకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

CM Revanth Reddy: లంబాడా తండాలకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!
Advertisement

CM Revanth Reddy:  దేశవ్యాప్తంగా సుమారు 15 కోట్ల మంది లంబాడీ గిరిజనులకు ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సంత్ సేవాలాల్ మహారాజ్ లంబాడీ సమాజాన్ని సన్మార్గంలో నడిపించి అభ్యున్నతి దిశగా తీసుకెళ్లిన మహనీయుడని, ఆయన బోధనలు నైతిక విలువలు, సేవాభావం మరియు సామాజిక ఐక్యతను బలపరిచాయని పేర్కొన్నారు. తన ప్రజా జీవిత ప్రగతిలో గిరిజనులు, లంబాడీ సమాజం చేసిన సేవలను స్మరించుకుంటూ వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ ఋణాన్ని తీర్చుకునే దిశగా రాష్ట్రంలోని ప్రతి తండాకు బీటీ రోడ్లు, సోలార్ పాముసెట్లు, పాఠశాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, తాగునీరు మరియు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.

70 వేల ఉద్యోగాలు భర్తీ

రాష్ట్రంలో 3.17 కోట్ల మందికి సన్నబియ్యం సరఫరా జరుగుతోందని, భూములున్న రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, అదనంగా 51 లక్షల పేద కుటుంబాలకు ప్రతి నెల 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. మహిళల కోసం ఉచిత బస్ సేవలను అమలు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే 9 వేల కోట్ల భారీ వ్యయాన్ని భరించిందని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచి వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నామని అన్నారు. ఉద్యోగాల పరంగా 563 మంది గ్రూప్–1 అధికారులతో పాటు మొత్తం 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు, వాటిలో అధిక శాతం అణగారిన వర్గాల వారికి లభించాయని ముఖ్యమంత్రి వివరించారు.

Advertisement

Also Read: Minister Ponguleti: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు.. ఎక్కడంటే..?

2500 మంది విద్యార్థులు చదివే అవకాశం

విద్యార్థులు కష్టపడి చదివి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఒక్కో చోట 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఒక్కో పాఠశాలలో సుమారు 2500 మంది విద్యార్థులు చదివే అవకాశం ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ప్రత్యేక గుర్తింపుగా సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి నల్లమల అచ్చంపేట అటవీ ప్రాంతంలో 20 ఎకరాల భూమి సేకరించామని, వచ్చే ఏడాదిలో దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి లక్షలాది మంది భక్తులతో జయంతి వేడుకలను అక్కడే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ పనులు లంబాడీ గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగేలా గిరిజన సంస్కృతిపై అవగాహన కలిగిన అధికారులను నియమిస్తామని స్పష్టం చేశారు.

సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం ఏర్పాటు

Advertisement

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అనంతపురం జిల్లాలో పుట్టినా తెలంగాణలో హైదరాబాద్ లోని బంజారాహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో ప్రయాణించి లంబాడీల అభ్యున్నతికి పాటుపడ్డారని, కాబట్టి వారికి బంజారాలు పవిత్రంగా భావించే ప్రదేశం నాగర్కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవులలో శ్రీ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరామ్ నాయక్, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్ర నాయక్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్, ట్రైకార్ చైర్మన్  బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ, రాములు నాయక్, మాజీ మంత్రి  రవీందర్ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు విట్టా సర్వేశ్వర రెడ్డి, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు డా. వేమూరి సముజ్వల, చీఫ్ ఇంజనీర్ బాలు నాయక్, జీసీసీ జీఎం ప్రతాప్ రెడ్డి, గిరిజన మ్యూజియం క్యురేటర్ డా. ద్యావనపల్లి సత్యనారాయణ తదితర ఉన్నత అధికారులు, లంబాడీ కళాకారులు, ప్రజా ప్రతినిధులు, గిరిజన విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

Also Read: PMEGP Scheme Apply: కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్లకు గుడ్ న్యూస్.. 35 శాతం సబ్సిడీతో రూ.50 లక్షల లోన్

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×