E-Paper
Advertisement

Road To Heaven: స్వర్గానికి రోడ్డు మార్గం ఉందట – ఎక్కడో తెలుసా..? ఎవరెవరు వెళ్లారో తెలుసా..?

Road To Heaven: స్వర్గానికి రోడ్డు మార్గం ఉందట – ఎక్కడో తెలుసా..? ఎవరెవరు వెళ్లారో తెలుసా..?

Road To Heaven: స్వర్గానికి రోడ్డు మార్గం ఉందట. స్వర్గానికి ఎవరు వెళ్లినా ఆ రోడ్డు నుంచే వెళ్తారట. శరీరంతో పాటు ఇప్పటి వరకు ఆ రోడ్డు గుండా ఎవరెవరో స్వర్గానికి వెళ్లారో తెలుసా..? అసలు సర్గానికి రోడ్డు ఎక్కడుందో తెలుసా..? ఇలాంటి ఆసక్తకరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూ గ్రంథాల ప్రకారం పుణ్యం చేసిన వారంతా చనిపోయాక స్వర్గానికి వెళ్తారని చెప్తుంటారు. అటువంటి స్వర్గానికి దారి మన దేశంలోనే ఉందని చెప్తున్నారు. ఆ దారి వెంటే వెళ్లి పుణ్యం చేసిన వాళ్లు స్వర్గం చేసుకుంటారట. పాండవులు కూడా ఇదే మార్గంలో స్వర్గానికి వెళ్లారట. అయితే స్వర్గం వెళ్లడానికి దారి ఎక్కడ మొదలవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బద్రీనాథ్‌ నుంచి మస: 

స్వర్గానికి వెళ్లడానికి బద్రీనాథ్‌ క్షేత్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మస అనే గ్రామం వెళ్లాలట. మన దేశంలో ఆఖరి గ్రామం ఇదేనట. ఇక్కడ నుంచి ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుందట. ఈ గ్రామ చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక అలకనంద నది లో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుందట. అక్కడే సరస్వతి మాత ఆలయం కుడా ఉంటుందట.ఈ సరస్వతి నది పక్కన  భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుందట. పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు. ఈ రాతి మీద భీముని వేలిముద్రలు ఉన్నట్లు గా పెద్ద పెద్ద అచ్చులు కుడా వుంటాయట. ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుందట.

మస నుంచి ప్రయాణం:

మస నుంచి నది దాటి 8 కిలోమీటర్లు వెలితే  భృగుమహర్షి ఆశ్రమం వస్తుందట. తర్వాత మాతమూర్తి ఆలయం కన్పిస్తుందట. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి గా కుడా చెప్తారు. ఈ ప్రాంతం 14000 అడుగుల ఎత్తులో ఉంటుందట. తర్వాత కుబేర్ మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతం గా తీసుకున్నట్లు చెప్తారు.

వసుధార జలపాతం:

కుబేర్‌ మకుట్‌ నుంచి 5 కిలోమీటర్లు  ప్రయాణం చేశాక వసుధార జలపాతం వస్తుందట. ఇక్కడే అష్ట వసువులు ( భీష్ముడు ఆఖరివాడు) దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెప్తారు. ఈ జలపాతం దాదాపు 120మీ ఎత్తు నుంచి జాలువారుతుంది. ఇక్కడ గాలులు బలం గా వీస్తుండడం చేత ధార చాల పలుచగా నీటి తుంపరల వలె పడుతుందట. అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు.

చట్మోలి:

తర్వాత చట్మోలి సముద్ర మట్టానికి 12000 అడుగుల ఎత్తులో ఉంటుందట. ఇది పచ్చని బయళ్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందట. ఇక్కడే సతోపంత్ మరియు భగీరధ్ కర్క్ అనే రెండు నదులు కలిసి అలకనంద గా ఏర్పడతాయట. అక్కడి నుండి ముందుకు వెళితే ధనో హిమానీనదం కు చేరుకుంటారట.

లక్ష్మీ పస్‌:

చట్మోలి నుండి ఒక కిలోమీటర్‌ వెలితే  లక్ష్మి వన్ వస్తుందట. ఇది 12600 అడుగుల ఎత్తులో ఉంటుందట.. ఇది ఒక అందమైన రకరకాల పూలు వుండే ప్రాంతం. ఏంతో ఆహ్లాదం గా ఉంటుందట. ఇక్కడే లక్ష్మి, విష్ణువు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు. ఇక్కడే ద్రౌపది దేవి తనువు చాలించిందట.

బంధర్‌:

లక్ష్మీ పస్‌ నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణించాక బంధర్‌ అనే ప్రాంతం వస్తుందట. ఇక్కడే ధర్మరాజు దాహం తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేసాడని చెప్తుంటారు. ఇక బంధర్‌ నుంచి 4 కిలోమీటర్లు వెళితే సహస్రధార వస్తుందట. ఇది 14 వేల అడుగుల ఎత్తులో ఉంటుందట. సహస్రధార నుంచి మరో 5 కిలోమీటర్లు వెళితే చక్రతీర్థం వస్తుదట. ఇది 15 వేల అడుగుల ఎత్తులో ఉంటుందట. ఈ చక్రతీర్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వలన ఏర్పడిన సరస్సు గా చెప్తారట. ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని చెప్తారు.

సతోపంత్:

చక్రతీర్థం నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే సంతోపంత్‌ వస్తుందట. ఇది త్రిభుజాకారంలో ఉండే సరస్సు అని చెప్తారు. ఇది 5 పర్వతాల మధ్య సుందరమైన స్వచ్చమైన నీరు ఉండే  సరస్సు అట. ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని గంధర్వులు పక్షుల రూపం లో వారిని సేవిస్తారని చెప్తారు.

స్వర్గారోహిణి:

సంతోపంత్‌ నుంచి 8 కిలోమీటర్లు వెళితే స్వర్గారోహిణి వస్తుందట. ఇక్కడి నుంచి దారి చాలా కష్టంగా ఉంటుందట. ప్రయాణం చేయడం చావుతో కూడుకున్న పనిలా ఉంటుందట. ఈ మార్గంలోనే చంద్రకుండ్, సూర్యకుండ్ అనే సరస్సులు వస్తాయట. ఇక్కడి నుంచి ధర్మరాజు మాత్రమే కుక్క తోడూ రాగా స్వర్గానికి ప్రయాణించాడని చెప్తారు.

ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం ( 20512 అ ఎత్తు లో , 6252 m ) మబ్బులలో ఉంటుందని అది 3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే  మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి  పైకి వెళితే స్వర్గ ముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు. ఇలా ధర్మరాజు ఒక్కడే సశరీరంగా అంటే శరీరంతో స్వర్గానికి వెళ్లారని చెప్తుంటారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: పూజ గదిలో ఆ వస్తువులు దరిద్రానికి సంకేతాలట – ఏ వస్తువులో తెలుసా

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×