E-Paper
Advertisement

ఒక్క పాటకు లక్ష జడలు సేల్.. ‘ఆయా షేర్’ రేంజ్ వేరే లెవెల్

ఒక్క పాటకు లక్ష జడలు సేల్.. ‘ఆయా షేర్’  రేంజ్ వేరే లెవెల్
Advertisement

Ayashare song: నాచురల్ స్టార్ నాని త్వరలోనే ది ప్యారడైజ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే సోనాలి కులకర్ణి, నాని (Nani)కలిసి యాంకర్ ప్రదీప్ తో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా వీరు సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలను ముచ్చటించారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకటి ఆయా షేర్(Ayashare) అని పాటను విడుదల చేయగా ఈ పాటకు అప్పట్లో మంచి ఆదరణ లభించింది ఇప్పటికీ కూడా ఈ పాట ట్రెండ్ అవుతూనే ఉంది.

100 మిలియన్ వ్యూస్

ఇక ఇటీవల ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఏష నాగుల(Yeshanagula) కట్ట సాంగ్ విడుదల చేయగా అతి తక్కువ సమయంలోనే వంద మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇలా ఈ రెండు పాటలు విడుదల చేసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఈ పాటలకు రీల్స్ చేస్తూ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాని ఆయా షేర్ పాట గురించి మాట్లాడుతూ ఈ సాంగ్ విడుదలైన తరువాత రీల్స్ చేయడం కోసం దాదాపు లక్ష జడలను కొనుగోలు చేశారని తన టీం తనకు చెప్పినట్టు నాని తెలియజేశారు.

రీల్స్ కోసం లక్ష జడలు..

Advertisement

ఇలా రీల్స్ కోసమే లక్ష జడలు అమ్ముడుపోవడం అంటే ఆయా షేర్ సాంగ్ ఏ రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో స్పష్టమవుతుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత థియేటర్లలో కూడా ఇదే రేంజ్ లో హవా ఉండబోతుందని చెప్పాలి. ప్రస్తుతం ఈ రెండు పాటలు కూడా చాలా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక కయాదు లోహార్ తో కూడా మంచి మెలోడీ సాంగ్ ఉందని అయితే అది నేరుగా థియేటర్ లోనే విడుదల అవుతుందని తెలిపారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో సెప్టెంబర్ 23వ తేదీ ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి.

800 షో లతో ప్రీమియర్లు..

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా దాదాపు 800 షో లతో ప్రీమియర్లు ప్రసారం కానున్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా నాని కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. మరి శ్రీకాంత్ ఓదెల ప్రేక్షకులకు అనుగుణంగా ఈ సినిమాతో ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు చెరుకూరి సుధాకర్ నిర్మాతగా వ్యవహరించగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే ఇందులో హీరోయిన్ గా ఖయాదు లోహర్(Kayadu Lohar) నటించగా స్పెషల్ సాంగ్ లో కీర్తి సురేష్ (Keerthy Suresh)సందడి చేశారు. ఇక విలన్ పాత్రలో మంచు మోహన్ బాబు కనిపించబోతున్న విషయం తెలిసిందే.

Advertisement

Also Read: బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్… షాలినికి బిగ్ సర్ప్రైజ్!

Related News

అందాల విందుతో ఐశ్వర్య మీనన్..కెమెరాలన్నీ ఆమెవైపే!

నాని చెప్పిన ‘సమ్మక్క’ వెనుక అసలు కథ ఏంటి?

సూర్య–జ్యోతిక మతం మార్చుకున్నారా? అసలు నిజం ఇదే!

కాకా ఎంట్రీకి డేట్ ఫిక్స్.. జనవరి 13న మెగాస్టార్ మాస్ జాతర!

గోవా టూర్‌లో స్నేహ ఉల్లాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

ఫౌజీ రిలీజ్‌పై సస్పెన్స్.. జనవరి 26కి వస్తుందా?

రామ్‌ను ఢీకొట్టేది జెనీలియా భర్తేనట.. సినిమా లెక్కే మారిపోనుందా?

Big Stories

Advertisement
×