Sneha Ullal Goa Photos:స్నేహ ఉల్లాల్..ఉల్లాసంగా ఉత్సాహంగా’అంటూ మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ గుర్తుందా.. ఐశ్వర్య రాయ్ కి మరో వెర్షన్ అంటూ అప్పట్లో మీడియా ఈ భామని ఒక రేంజ్ లో వైరల్ చేసేసింది.ఇక ఆ ట్యాగ్ తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ భామ.. ఆ తర్వాత ‘కరెంట్’, ‘సింహా’, ‘అలా మొదలైంది’, ‘మడత కాజా’ వంటి సినిమాలతో మంచి పేరే తెచ్చుకుంది.
అయితే ఆ తర్వాత సినిమాల్లో అంతగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, ట్రావెల్ అప్డేట్స్‌తో అభిమానులను పలకరిస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి తన గోవా ట్రిప్ ఫొటోలతో నెట్టింట సందడి చేస్తోంది.
కూల్‌గా వెకేషన్ లో చిల్ అవుతుందిగా
తాజాగా స్నేహ ఉల్లాల్ తన ఇంస్టాలో గోవా వెకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు చూస్తే అమ్మడు గోవా ట్రిప్‌ను ఈ అమ్మడు ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తుందని అర్థం అవుతుంది.ఇక ఫోటోలు అలా షేర్ చేసిందో లేదో ‘స్నేహ.. లుక్ చాలా సింపుల్‌గా ఉన్నా.. ఆమె గ్లామర్ మాత్రం అస్సలు తగ్గలేదు అంటూ కొందరు కామెంట్ చేస్తే ఫుల్‌గా రిలాక్స్ అవుతూ, కూల్‌గా వెకేషన్ లో చిల్ అవుతుందిగా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
స్నేహ పెట్టిన క్యాప్షన్ వైరల్
ఇక ఈ ఫొటోలని షేర్ చేస్తూ స్నేహ పెట్టిన క్యాప్షన్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.“Goa Done Right with @jwmarriott_goa” అంటూ తన గోవా ట్రిప్ గురించి చెప్పుకొచ్చింది.అలాగే తనను, తన వాళ్లను ఎంతో బాగా చూసుకున్నందుకు Marriott జనరల్ మేనేజర్ హిమాంశు తనేజాకు థ్యాంక్స్ చెప్పింది. అలాగే ఈ ట్రిప్‌ను మరింత స్పెషల్‌గా మార్చిన సుంకడీకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది స్నేహ. చివర్లో మళ్లీ గోవాకు వస్తామని చెప్పడం ఇక్కడ విశేషం.
ఇక స్నేహ షేర్ చేసిన ఫొటోల్లో ఫ్యాషన్ లుక్ కంటే కూడా చాలా న్యాచురల్‌గా కనిపించేలా ఈ వెకేషన్ ఫొటోలు ఉండటంతో అభిమానులు కూడా ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. సినిమాల్లో కనిపించి చాలా కాలం అయినా.. స్నేహ ఉల్లాల్‌కు ఉన్న క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదని ఈ రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్
స్నేహ ఉల్లాల్ పేరు చెప్పగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చే సినిమా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’. యశోసాగర్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘కరెంట్’లోనూ కనిపించిన స్నేహ.. బాలకృష్ణ నటించిన ‘సింహా’ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించింది.
ఇక ‘అలా మొదలైంది’ వంటి సినిమాల్లోనూ ఆమె సందడి చేసింది. ఒక దశలో వరుస సినిమాలతో బిజీగా కనిపించిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమవడం గమనార్హం. మొత్తానికి స్నేహ ఉల్లాల్ కొత్త సినిమా అప్‌డేట్‌తో కాకుండా.. గోవా ట్రిప్ ఫొటోలతో ఇలా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.