E-Paper
Advertisement

కాకా ఎంట్రీకి డేట్ ఫిక్స్.. జనవరి 13న మెగాస్టార్ మాస్ జాతర!

కాకా ఎంట్రీకి డేట్ ఫిక్స్.. జనవరి 13న మెగాస్టార్ మాస్ జాతర!
Advertisement

Chiranjeevi Kaka Release Date:ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకి క్లారిటీ వచ్చేసింది.కాకా గా చిరు ఎప్పుడు బరిలోకి దిగతాడా అని ఇన్ని రోజులు ఈగర్ గా వెయిట్ చేసిన అభిమానులకి ఎట్టకేలకి అప్ డేట్ ఇచ్చేశారు మేకర్స్.అవును..చిరంజీవి హీరోగా, బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని లాక్ చేసేశారు మేకర్స్. 2027 సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ‘కాకా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ అనౌన్స్ చేయడంతో హ్యాపీ మోడ్ లోకి వెళ్లి పోయారు మెగా ఫ్యాన్స్.

ఇక జనవరి 13న థియేటర్లలోకి వస్తున్నామని చెప్పడంతో పాటు త్వరలోనే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు కూడా మేకర్స్ చెప్పెయ్యడం ఇక్కడ విశేషం.అంటే త్వరలోనే సినిమా నుండి ఇక వరుస అప్ డేట్స్ రానున్నాయన్నమాట.

Advertisement

ఆ కాంబోలోనే మరో సినిమా

చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో గతంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెల్సిందే.అప్పటి వరకు సాలిడ్ మాస్ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూసిన మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమా అది,ఇపుడు ఆ కాంబోలోనే మరో సినిమా వస్తుండటం తో అంచనాలు బాగా పెరిగిపోయాయి.

Advertisement

ఇక ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.ఇక బ్యానర్ రేంజ్ కి తగ్గట్టుగా ఈ సినిమాని పాన్ ఇండియా మార్కెట్‌ ని టార్గెట్ చేస్తూ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ టాక్. ఇక ఈ సినిమాలో చిరుకి భార్యగా స్నేహ నటిస్తుండగా, కూతురు పాత్రలో అనస్వర రాజన్ నటిస్తుందని వినిపిస్తుంది.

సోషల్ మీడియాలో కూడా భారీగా వైరల్

ఇక ‘కాకా’కు ఫస్ట్ సింగిల్ త్వరలోనే వస్తుందని మేకర్స్ చెప్పడం ఇప్పుడు మరో క్రేజీ అప్ డేట్ అనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి సినిమాల్లో పాటలకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘వాల్తేరు వీరయ్య’లోని పాటలు, మాస్ డ్యాన్స్ నంబర్స్ అప్పట్లో సోషల్ మీడియాలో కూడా భారీగా వైరల్ అయ్యాయి కూడా.

ఇప్పుడు బాబీ మరోసారి మెగాస్టార్‌తో కలిసి ఎలాంటి మ్యూజిక్ ట్రీట్ ఇవ్వబోతున్నాడనేది చూడాలి. ఏది ఏమైనా ఫస్ట్ సింగిల్ విడుదలైన తర్వాత ‘కాకా’పై ఉన్న బజ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నది వాస్తవం .

ALSO READ:గోవా టూర్‌లో స్నేహ ఉల్లాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

చిరు ఆ అంచనాలని ఎలా అందుకుంటాడో

ఇక చిరంజీవి కెరీర్‌ చూస్తె రీ ఎంట్రీ తర్వాత అంతగా హిట్ పర్సెంటేజ్ ని పట్టుకోలేడనే చెప్పాలి. ఖైదీ నెంబర్ 150,వాల్తేరు వీరయ్య’సూపర్ హిట్ అయినప్పటికీ గాడ్‌ఫాదర్’, ‘భోళా శంకర్’,లు బాగానే డిసప్పాయింట్ చేశాయి. అయితే ఈ ఏడు వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు ఆ లోటుని కాస్త భర్తీ చేసింది. ఇక ఊరిస్తున్న ‘విశ్వంభర’ ఎలా ఉంటుందో.మొత్తానికి మరోసారి నాలోని మాస్ ని పరిచయం చేస్తానంటూ కాకా గా వస్తున్న చిరు ఆ అంచనాలని ఎలా అందుకుంటాడో పొంగల్ సీజనే తేల్చెయ్యాలి !

Tags

Related News

ఒక్క పాటకు లక్ష జడలు సేల్.. ‘ఆయా షేర్’ రేంజ్ వేరే లెవెల్

గోవా టూర్‌లో స్నేహ ఉల్లాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

ఫౌజీ రిలీజ్‌పై సస్పెన్స్.. జనవరి 26కి వస్తుందా?

రామ్‌ను ఢీకొట్టేది జెనీలియా భర్తేనట.. సినిమా లెక్కే మారిపోనుందా?

అఖిల్ నెక్స్ట్ మూవీస్ లిస్ట్ ఇదేనా? ఒక్కోటి ఒక్కో రేంజ్!

ఆ తమిళ డైరెక్టర్ తో సినిమా చేయటం డ్రీమ్..నాని కల నెరవేరేనా?

టాక్సిక్ ప్లాప్.. చేతిలో మాత్రం భారీ ప్రాజెక్టులు! యష్ లెక్కేంటో?

Big Stories

Advertisement
×