E-Paper
Advertisement

రామ్‌ను ఢీకొట్టేది జెనీలియా భర్తేనట.. సినిమా లెక్కే మారిపోనుందా?

రామ్‌ను ఢీకొట్టేది జెనీలియా భర్తేనట.. సినిమా లెక్కే మారిపోనుందా?
Advertisement

Ram Pothineni Next Movie:ఆంద్రా కింగ్ తాలుకా సినిమా టాక్ బాగానే వచ్చినప్పటికీ వసూళ్లు రాబట్టలేకపోవడంతో ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాడు రామ్. ఇక వారు వీరు ఎందుకంటూ ఏకంగా తనే ఈసారి మెగాఫోన్ కూడా పట్టుకుని దర్శకత్వం చేసే పనిలో పడ్డాడు. అయితే ఈ సినిమాలో రామ్‌కు పోటీగా నటించే విలన్ ఎవరా అంటూ సాగిన చర్చలకి ఇపుడు ఎండ్ కార్డ్ పడినట్టే కనిపిస్తుంది.

అవును..రామ్ ఈ సినిమాను ఒక సాదా సీదా సినిమాలా కాకుండా థ్రిల్లర్, యాక్షన్, డ్రామా ని మిక్స్ చేసి తెరకెక్కిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.ఇక కథలో హీరోతో సమానంగా విలన్ పాత్రకు కూడా ఇంపార్టెన్స్
ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ని రామ్ సంప్రదించాడట. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉన్నప్పటికీ, ఇండస్ట్రీలో మాత్రం ఈ కాంబినేషన్‌పై చర్చ మొదలైందనడంలో సందేహం లేదు.

Advertisement

విలన్‌గా  మంచి గుర్తింపు

ఇక రితేష్ దేశ్‌ముఖ్ అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు. కామెడీ నుంచి సీరియస్ పాత్రల వరకు ఎన్నోషేడ్స్ చూపించిన ఆయనకు విలన్‌గా కూడా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఏక్ విలన్ సినిమాలో చేసిన పాత్ర ఆయన కెరీర్‌లో స్పెషల్ గా నిలిచిపోయింది . ఆ తర్వాత కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో రితేష్ తన నటనతో మెప్పించాడు కూడా . ఇప్పుడు రామ్ పోతినేని సినిమాకు రితేష్ ని గనుక తీసుకుంటే అది సినిమాకి మరింత ప్లస్ అవుతుందని చెప్పక్కర్లేదు.

Advertisement

గతంలో జెనీలియాతో కలిసి నటించిన రామ్

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే రామ్ పోతినేని గతంలో జెనీలియాతో కలిసి నటించిన విషయం తెలిసిందే. రెడీ సినిమాలో వీరిద్దరి జోడీ అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది కూడా . ఆ సినిమాలో రామ్, జెనీలియా మధ్య కెమిస్ట్రీ, కామెడీ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇప్పుడు అదే జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ రామ్‌కు విలన్‌గా కనిపించనున్నారనే వార్త రావడంతో ఈ కాంబినేషన్‌పై మరింత క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్ .

వరుస షెడ్యూల్స్‌తో కంప్లీట్

రామ్ పోతినేని విషయానికి వస్తే, ఆయన గతంలో కూడా యాక్షన్, మాస్ జానర్‌లలో తనదైన మార్క్ చూపించాడు.ముఖ్యంగా ఇష్మార్ట్ శంకర్, రెడ్, ది వారియర్,స్కంద సినిమాలతో మాస్ ఇమేజ్ ని తెచ్చుకునే ప్రయత్నం చేశాడు.మరి ఇపుడు హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా రామ్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్నది చూడాలి.ఇక సినిమాని వరుస షెడ్యూల్స్‌తో కంప్లీట్ చేసి త్వరగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్.

  sj సూర్యని ఎలా మరిపిస్తాడో !

ఇక ఈ సినిమాను రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్నట్లు నిర్మిస్తుండగా నిర్మాణ పరంగా యాక్షన్ , టెక్నికల్ అంశాలు, విజువల్ ట్రీట్‌మెంట్..ఇలా ఎక్కడా రాజీ పడకుండా సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది .ఇక సినిమాని ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ALSO READ:అఖిల్ నెక్స్ట్ మూవీస్ లిస్ట్ ఇదేనా? ఒక్కోటి ఒక్కో రేంజ్!

అయితే మొదటగా sj సూర్యని అనుకున్నప్పటికీ భారీగా పారితోషికం డిమాండ్ చేయడంతో రితేష్ దేశ్‌ముఖ్ ని సంప్రదించారట మేకర్స్.చూడాలి మరి  sj సూర్యని ఈ బాలీవుడ్ విలన్ ఎలా మరిపిస్తాడో !

Tags

Related News

ఫౌజీ రిలీజ్‌పై సస్పెన్స్.. జనవరి 26కి వస్తుందా?

అఖిల్ నెక్స్ట్ మూవీస్ లిస్ట్ ఇదేనా? ఒక్కోటి ఒక్కో రేంజ్!

ఆ తమిళ డైరెక్టర్ తో సినిమా చేయటం డ్రీమ్..నాని కల నెరవేరేనా?

టాక్సిక్ ప్లాప్.. చేతిలో మాత్రం భారీ ప్రాజెక్టులు! యష్ లెక్కేంటో?

ప్యారడైజ్ విషయంలో కీర్తి సురేష్ సీరియస్.. అసలు మ్యాటర్ చెప్పిన నాని!

పిల్లలు పుట్టాక మీ భార్యలను వదిలేస్తారా? మాధవీలత ఘాటు వ్యాఖ్యలు

సంక్రాంతి రేసులోనే ‘కాకా’ మేకర్స్ క్లారిటీ.. ‘విశ్వంభర’ వెనక్కి తగ్గాల్సిందేనా!

Big Stories

Advertisement
×