E-Paper
Advertisement

అందాల విందుతో ఐశ్వర్య మీనన్..కెమెరాలన్నీ ఆమెవైపే!

అందాల విందుతో ఐశ్వర్య మీనన్..కెమెరాలన్నీ ఆమెవైపే!
Advertisement

Aishwarya Menon:ఈ మధ్య కాలంలో సినిమాలు తక్కువైనా సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు మన అందాల భామలు.ఇదిగో అదే బాటలో నేనూ అంటుంది మళయాళ బ్యూటీ ఐశ్వర్య మీనన్.ఈ క్రమంలోనే తాజాగా ‘SIIMA Day 2’ అంటూ ఈ ముద్దుగుమ్మ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అవార్డ్ ఫంక్షన్‌కు వెళ్లిన ఈ అమ్మడు అక్కడ ఎలా మెరిసిపోయిందో ఫొటోలు చూస్తేనే అర్థమవుతోంది. వైట్ కలర్ షిమ్మరీ డ్రెస్‌లో ఐశ్వర్య గ్లామరస్‌గా కనిపించడంతో మా ఇష్ మాములుగా లేదుగా అంటూ తెగ షేర్ చేస్తున్నారు ఐశ్వర్య ఫాలోవర్స్.

Advertisement

ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్

సినిమాలతో పాటు తన ఫొటోషూట్స్‌ ని కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇస్తుంటుంది ఐశ్వర్య మీనన్‌ ,అందుకే ఆమె ఫ్యాన్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు .ఇక ఈ క్రమంలోనే తాజాగా SIIMA రెండో రోజుకి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘SIIMA Day 2’ అంటూ చిన్న క్యాప్షన్ పెట్టి ఈ ఫొటోలను పోస్ట్ చేసింది. అంతే.. పోస్ట్ ఇలా పెట్టిందో లేదో లైక్ ల వర్షం కురిపించారు ఫాలోవర్స్.

Advertisement

ఇక ఈ ఫొటోల్లో ఐశ్వర్య మెరిసిపోయే వైట్ డ్రెస్‌లో, పెద్ద ఇయర్ రింగ్స్‌తో, సింపుల్ హెయిర్ స్టైల్‌తో కనిపించింది.ముఖ్యంగా డ్రెస్‌కు తగ్గట్టుగా చేసిన స్టైలింగ్ ఆమె లుక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేసిందనే చెప్పాలి. అందుకే ఇప్పుడు సినిమా అప్‌డేట్ ఏమీ లేకపోయినా ఐశ్వర్య మీనన్ పేరు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

కెరీర్ విషయానికి వస్తే

ఐశ్వర్య మీనన్ సినీ కెరీర్ విషయానికి వస్తే నిఖిల్ హీరోగా వచ్చిన ‘స్పై’ సినిమాలో ఆమె కీ రోల్ పోషించింది.ఆ తర్వాత ‘భజే వాయు వేగం’ సినిమాలోనూ కనిపించి అలరించింది. రీసెంట్‌గా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ వంటి మైథలాజికల్ సినిమాలోనూ మెరిసింది.ఇక ప్రస్తుతం తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో తన లక్ ని టెస్ట్ చేసుకునే పనిలో పడింది. ఇలా ఒక భాషకే పరిమితం కాకుండా సౌత్‌లో వరుసగా సినిమాలు చేసే ప్లాన్ వేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఐశ్వర్యకు మంచి క్రేజ్ ఉంది. సినిమా షూటింగ్, ట్రావెల్, ఫొటోషూట్స్‌కు సంబంధించిన ఫొటోలను ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందుకే ఆమె నుంచి ఏ పోస్ట్ వచ్చినా ఫ్యాన్స్ వెంటనే రియాక్ట్ అవుతుంటారు.

సెలబ్రిటీల ఫ్యాషన్ షో

అవార్డ్ ఫంక్షన్స్ విషయానికి వస్తే ఇదొక  సెలబ్రిటీల ఫ్యాషన్ షో అన్నట్టుగా మారిపోయింది. హీరోలు, హీరోయిన్లు, మోడల్స్.. ఎవరి స్టైల్‌లో వాళ్లు రెడ్ కార్పెట్‌పై సందడి చేస్తుంటారు. అసలు అవార్డ్ ఎవరికి వచ్చింది అనే దానికంటే ముందుగా ఎవరు ఏ డ్రెస్ వేసుకున్నారు? ఎవరి లుక్ బాగుంది? ఎవరి ఫొటోలు వైరల్ అవుతున్నాయి? అనే చర్చ కూడా ఇపుడు  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.ఇదిగో అలా అయ్యిందే ఐశ్వర్య మీనన్ లుక్ .చూడాలి మరి ..సోషల్ మీడియాలో ఫోటోలతో వైరల్ అవుతున్న భామ ఎలాంటి సినిమాలతో పలకరిస్తుందో !

Tags

Related News

టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమ.. ఎంగేజ్‌మెంట్.. ఇప్పుడు ఎవరి దారి వారిదే!

నాని చెప్పిన ‘సమ్మక్క’ వెనుక అసలు కథ ఏంటి?

సూర్య–జ్యోతిక మతం మార్చుకున్నారా? అసలు నిజం ఇదే!

ఒక్క పాటకు లక్ష జడలు సేల్.. ‘ఆయా షేర్’ రేంజ్ వేరే లెవెల్

కాకా ఎంట్రీకి డేట్ ఫిక్స్.. జనవరి 13న మెగాస్టార్ మాస్ జాతర!

గోవా టూర్‌లో స్నేహ ఉల్లాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

ఫౌజీ రిలీజ్‌పై సస్పెన్స్.. జనవరి 26కి వస్తుందా?

Big Stories

Advertisement
×