E-Paper
Advertisement

బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్… షాలినికి బిగ్ సర్ప్రైజ్!

బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్… షాలినికి బిగ్ సర్ప్రైజ్!
Advertisement

Bigg Boss 10 Telugu: బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమంలో ప్రేక్షకుల ఊహకు అందని విధంగా వరుస ట్విస్టులతో షాక్ ఇస్తున్నారు. దశావతారం అంటూ ఈ కార్యక్రమం మొదటి నుంచి పెద్ద ఎత్తు హైప్ క్రియేట్ చేశారు. అందుకు అనుగుణంగానే ఈ షో ప్రసారమవుతుంది. ఇక బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమైన మొదటి వారమే ఈ హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసిన సంగతి తెలిసిందే .ఇలా మొదటి వారమే ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్లడం బిగ్ బాస్ చరిత్రలోనే ఇది మొదటిసారి. ఇలా హౌస్ నుంచి కామనర్ అయినటువంటి చరణ్ (Charan)మిడ్ వీక్ బయటకు వెళ్లగా, చైత్ర(Chaitra) వీకెండ్ లో హౌస్ నుంచి బయటకు వచ్చారు..

రీ ఎంట్రీ ఇచ్చిన ఆర్జే చరణ్..

ఇలా మొదటివారం ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు రావడంతో బిగ్ బాస్ వీరికి మరో అవకాశం ఇచ్చారు. వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని తిరిగి హౌస్ లోకి పంపించబోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే చరణ్ చైత్ర ఇద్దరిలో హౌస్ లోకి ఎవరు వెళ్లబోతున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే తాజాగా బిగ్ బాస్ ప్రోమోలో భాగంగా హౌస్ లోకి చరణ్ రీ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. నటి చైత్ర రాయ్ తో పోలిస్తే చరణ్ కు ఎక్కువ మద్దతు లభించింది దీంతో ఈయన హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

చరణ్ తో హౌస్ లోకి అడుగుపెట్టిన శాలిని..

Advertisement

ఇక చరణ్ ను హౌస్ లోకి శాలిని తీసుకువచ్చారు. బిగ్ బాస్ హౌస్లో గార్డెన్ ఏరియాలో శవ పేటికలు అస్తిపంజరాలతో ఒక భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అయితే వాటిని ముందుగా తాకిన కంటెస్టెంట్ ను గ్రీన్ రీపెర్స్ తమ వెంట తీసుకువెళ్లారు. ఇలా శాలిని ముందుకు వెళ్లి బాక్స్ ను తాకడంతో వెంటనే ఆమెను హౌస్ నుంచి బయటకు తీసుకు వెళ్ళగా అందరూ శాలిని ఎలిమినేట్ అయిందని భావించారు కానీ బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. శాలిని ఎలిమినేట్ కాలేదని షాలిని హౌస్ నుంచి బయటకు వెళ్లి అక్కడే ఉన్నటువంటి చరణ్ ను తీసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు.

?stkn=cXRmcWJ6ZGlvZ2o5

Advertisement

ఇలా చరణ్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో కంటెస్టెంట్లు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇక చరణ్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే నేరుగా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశాన్ని కూడా కల్పించారు. ఇలా చరణ్ రీ ఎంట్రీ కేవలం ఎంట్రీగా కాకుండా ఈ గేమ్ ను కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వారం రోజులపాటు బయట నుంచి గేమ్ అబ్జర్వ్ చేసిన చరణ్ ఇప్పుడు లోపలికి వెళ్లడంతో తన ఆట తీరు పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. మరి రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్ తన గేమ్ ఎలా మార్చుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: ఆ తమిళ డైరెక్టర్ తో సినిమా చేయటం డ్రీమ్..నాని కల నెరవేరేనా?

Related News

బిగ్ బాస్ హౌస్ లో శవపేటికలు, అస్తిపంజరాలు.. అసలేం జరుగుతోంది భయ్యా!

గెటప్ శ్రీను రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హీరోలను మించిపోయాడుగా?

సీరియల్‌లో నటించేది కొన్ని గంటలే.. కానీ రెమ్యునరేషన్ మాత్రం వేలల్లో!

సెలబ్రిటీస్ ఆధిపత్యం వెనుక గుట్టు విప్పిన ఉదయభాను!

యాంకర్‌గా ఉదయభాను కెరీర్ అలా మొదలైందా? సడన్‌గా గుడ్‌బై ఎందుకు చెప్పింది?

నేను చేస్తే తప్పు? మీరు చేస్తుందేంటీ..డ్రెస్సింగ్ స్టైల్ పై ఉదయభాను ఫైర్!

యాంకర్ సుమతో గొడవలు.. అసలు విషయం చెప్పిన ఉదయభాను

Big Stories

Advertisement
×