Prabhas Fauji Release Date:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వచ్చే సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’, ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే ఏ సినిమాపై అయినా ఆడియన్స్ ఫోకస్ గట్టిగానే ఉంటుంది.
అలాంటి క్రేజ్ ఉన్న సినిమాల్లో ‘ఫౌజీ’ కూడా ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ హైప్ ఉందన్న సంగతి తెల్సిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ విషయంలో ఇండస్ట్రీలో ఓ సరికొత్త డిస్కషన్ జరుగుతుంది.
అవును ..ముందుగా అనుకున్న ప్రకారం ‘ఫౌజీ’ని డిసెంబర్ 3న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెల్సిందే.కానీ వాలకం చూస్తుంటే ఆ తేదీకి సినిమా రావడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా షూటింగ్ పనులు ఇంకా పూర్తిగా ముగియలేదని, రెండు కీలకమైన భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలు కూడా చిత్రీకరించాల్సి ఉందని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది.
హడావుడిగా పూర్తి చేయడం కన్నా
ముఖ్యంగా సినిమాపై ఉన్న అంచనాలని దృష్టిలో పెట్టుకుని షూటింగ్‌ను హడావుడిగా పూర్తి చేయడం కన్నా టైం తీసుకుని క్వాలిటీతో కంప్లీట్ చేయడమే మంచిదనే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది.మాములుగా స్టార్ హీరోల సినిమాలకు కొన్ని రోజుల ప్యాచ్ వర్క్ అంటే పెద్ద విషయం కాదు. కానీ ‘ఫౌజీ’లో యాక్షన్ పార్ట్ చాలా ముఖ్యం కావడంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.ఇక
భారీ సెట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, పెద్ద సంఖ్యలో ఆర్టిస్టులు పాల్గొనే సీక్వెన్స్‌లు కావడంతో షూటింగ్‌కు ఎక్కువ సమయం అవసరమవుతోందని టాక్.
మరోవైపు షూటింగ్ పూర్తయిన తర్వాత ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఉండటంతో డిసెంబర్ 3 న వస్తుందా రాదా అన్న డౌట్స్ ఇపుడు సోషల్ మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా రైజ్ అవుతున్నాయి.
జనవరి 26, 2027న ‘ఫౌజీ’ విడుదల?
ఈ క్రమంలోనే సినిమాని జనవరి 26, 2027న ‘ఫౌజీ’ని విడుదల చేస్తే ఎలా ఉంటుందా అని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. పైగా రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చే లాంగ్ వీకెండ్ సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉండటంతో ఈ తేదీపై మూవీ యూనిట్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు కాబట్టి ఏమైనా జరగవచ్చు.
ఒకే ఏడాదిలో ప్రభాస్ నుంచి రెండు సినిమాలు
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ‘ఫౌజీ’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’పై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పక్కర్లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం,పైగా ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘స్పిరిట్’కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.
ALSO READ:రామ్‌ను ఢీకొట్టేది జెనీలియా భర్తేనట.. సినిమా లెక్కే మారిపోనుందా?
దీంతో ఒకే ఏడాదిలో ప్రభాస్ నుంచి రెండు సినిమాలు వస్తే వాటి మధ్య సరైన గ్యాప్ ఉండటం ముఖ్యమని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.చూడాలి మరి ఇంత డైలమాల మధ్య ఫౌజీ ఎప్పుడు బాక్సాఫీస్ పై ఎటాక్ చేస్తాడో !