E-Paper
Advertisement

నాని చెప్పిన ‘సమ్మక్క’ వెనుక అసలు కథ ఏంటి?

నాని చెప్పిన ‘సమ్మక్క’ వెనుక అసలు కథ ఏంటి?
Advertisement

The Paradise Nani: పక్కింటి కుర్రాడిగా పాతుకుపోయిన నాని ఇపుడు ట్రాక్ మార్చాడు.ఎప్పుడు అవే పాత్రలా అంటూ దసరాతో మాస్ బాట పట్టాడు,ఇక హిట్ 3 లో బ్లడ్ బాత్ ఎలా పారించాడో చెప్పక్కర్లేదు.ఇక వంద కోట్లకి పైగా కొల్లగొట్టిన దసరా కాంబోలోనే ఇపుడు మరోసారి ప్యారడైజ్ అంటూ సరికొత్త సినిమాని పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో కూడా వేగం పెంచాడు.

‘దసరా’లో నానిని చాలా రఫ్ అండ్ మాస్ లుక్‌లో చూపించిన శ్రీకాంత్ ఓదెల.. ఈసారి మరింత మాసీగా చూపించబోతున్నాడని వచ్చిన గ్లిప్మ్స్ లోనే అర్థం అయింది. ఇక సినిమా పోస్టర్లు, టీజర్, ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే కథ ఏంటి? నాని క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అనే క్యూరియాసిటీ రోజురోజుకూ పెరుగుతోంది కూడా.

Advertisement

ది ప్యారడైజ్’ గురించి మరో క్రేజీ న్యూస్

ఇదిలా ఉండగా అయితే ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ గురించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. అదే నాని తల్లి పాత్ర. ఈ సినిమాలో ప్రముఖ నటి సొనాలి కులకర్ణి నాని తల్లి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెల్సిందే. ఎదో రెగ్యు లర్ గా నాలుగు ఎమోషనల్ సీన్లు, కొంచెం సెంటిమెంట్ అన్నట్టుగా కాకుండా ఈ సినిమాలో సొనాలి కులకర్ణి పాత్ర ఒక రేంజ్ లో ఉండబోతుందని నానీ ఏ స్వయంగా చెప్పేశాడు.

Advertisement

తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని మాట్లాడుతూ సొనాలి కులకర్ణి పాత్ర గురించి పలు ఆసక్తికరమైన సంఘటనలు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ పెట్టకుండా ఇంకేదైనా పేరు పెట్టాల్సి వస్తే ‘సమ్మక్క’ అని పెట్టేవాళ్లమని నాని చెప్పాడు. అంతేకాదు.. ‘ఇది పూర్తిగా ఆమె చిత్రమే’ అంటూ క్యారెక్టర్‌కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో చెప్పేశాడు న్యాచురల్ స్టార్.

ఆమె చుట్టూనే తిరుగుతుందా?

అసలు నాని ‘సమ్మక్క’ అనే పేరు ఎందుకు చెప్పాడు? సినిమాలో ఆ పాత్ర అంత పవర్‌ఫుల్‌గా ఉంటుందా? లేక కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందా? అనేది ఇప్పుడు ఆడియన్స్ లో వస్తున్న ప్రశ్న. నాని మాటలు విన్న తర్వాత ఫ్యాన్స్ కూడా ఇపుడు సోషల్ మీడియాలో ఈ సమ్మక్క పైనే చర్చ జరుగుతుంది. ఇక సొనాలి కులకర్ణి ఎలాంటి నటి అన్నది బాలీవుడ్ లో ఆమె చేసిన పాత్రలే చెబుతాయి.సో

మాములు తల్లి పాత్ర కోసం ఈ సినిమాలోకి వచ్చారని అనుకోవడానికి లేదు. దానికి తోడు నాని స్వయంగా ‘సమ్మక్క’ అంటూ ప్రస్తావించడం చూస్తుంటే.. సినిమాలో ఆమె పాత్ర గట్టిగానే పేలేలా ఉందని ఫిక్స్ అయిపోతున్నారు నాని ఫ్యాన్స్.

సెప్టెంబర్ 24న థియేటర్లలో

మరోవైపు అనిరుధ్ మ్యూజిక్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. నాని స్క్రీన్‌పై మాస్‌గా కనిపించే సన్నివేశాలకు అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లలో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.మొత్తంగా సమ్మక్క’ అనే పేరు వెనుక అసలు కథ ఏంటి? సొనాలి కులకర్ణి క్యారెక్టర్‌కు నాని క్యారెక్టర్‌కు మధ్య ఉన్న బంధం ఎలా ఉంటుంది?అనేది సెప్టెంబర్ 24న థియేటర్లలోనే తేలిపోనుంది .

ALSO READ:సూర్య–జ్యోతిక మతం మార్చుకున్నారా? అసలు నిజం ఇదే!

Tags

Related News

టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమ.. ఎంగేజ్‌మెంట్.. ఇప్పుడు ఎవరి దారి వారిదే!

అందాల విందుతో ఐశ్వర్య మీనన్..కెమెరాలన్నీ ఆమెవైపే!

సూర్య–జ్యోతిక మతం మార్చుకున్నారా? అసలు నిజం ఇదే!

ఒక్క పాటకు లక్ష జడలు సేల్.. ‘ఆయా షేర్’ రేంజ్ వేరే లెవెల్

కాకా ఎంట్రీకి డేట్ ఫిక్స్.. జనవరి 13న మెగాస్టార్ మాస్ జాతర!

గోవా టూర్‌లో స్నేహ ఉల్లాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

ఫౌజీ రిలీజ్‌పై సస్పెన్స్.. జనవరి 26కి వస్తుందా?

Big Stories

Advertisement
×