Suriya Jyothika Anniversary:సూర్య–జ్యోతికలు తమ పెళ్లి జరిగి ఇరవై ఏళ్ళు అయిన సందర్భంగా మరోసారి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ తాజాగా చర్చిలో దిగిన ఫోటోలు మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఫోటోలలో జ్యోతిక తెల్లటి వెడ్డింగ్ గౌన్‌లో కనిపించగా సూర్య కూడా వెడ్డింగ్ సూట్‌లో కనిపించారు.
పైగా చర్చిలో కార్యక్రమం జరగడం తో అయితే ఈ ఫోటోలు చూడగానే ఇద్దరూ మతం మార్చుకున్నారా? అందుకే క్రిస్టియన్ స్టైల్‌లో మళ్లీ పెళ్లి చేసుకున్నారా?అంటూ సోషల్ మీడియాలో తెగ డిబేట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.
అసలు విషయం ఏంటంటే
అసలు విషయానికి వస్తే జ్యోతిక అసలు పేరు జ్యోతిక సదానా.తండ్రి పేరు చందర్ సదానా. ఆమె తల్లి సీమా సదానా.ఈవిడ ముస్లిం కుటుంబానికి చెందిన వారు.వీరిదిముంబైలో పంజాబీ మాట్లాడే కుటుంబం.ఇక చందర్ సదానా పలు సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారు కూడా. ఇక సూర్య విషయానికి వస్తే తను పక్కా హిందూ కుటుంబంలో పుట్టారు. సో వీరేవరికి క్రిస్టియన్ బ్యాక్ గ్రౌండ్ లేదు.కేవలం తమ పెళ్లి జరిగి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ జ్ఞాపకాలని గుర్తుచేసుకుంటూ ఇలా సరదాగా క్రిస్టియన్ మ్యారేజ్ లుక్ లో తమ వౌ రిన్యూవల్ వేడుక జరుపుకున్నారు.సో అదన్న మాట అసలు సంగతి.
‘ది సీక్వెల్’
ఇక తమ మధురజ్ఞాపకాల్ని షేర్ చేస్తూ యానివర్సరీ సెలబ్రేషన్‌గా కాకుండా ‘ది సీక్వెల్’ అంటూ ఈ వౌ రిన్యూవల్ వేడుకకి జ్యోతిక పేరు పెట్టింది కూడా.ఇక తమ 20 ఏళ్ల తమ ప్రయాణంలో ప్రేమతో పాటు గొడవలు, సర్దుబాట్లు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, త్యాగాలు కూడా ఉన్నాయని స్వయంగా ఆమె చెప్పడం ఇక్కడ విశేషం.అంటే ఇది కొత్తగా మొదలైన బంధం కాదు.. ఇప్పటికే కలిసి నడిచిన జీవితాన్ని మరోసారి సెలబ్రేట్ చేసుకున్న సందర్భం అన్న మాట.
ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి అప్పట్లోనే మంచి క్రేజ్
ఇక సూర్య, జ్యోతికల విషయానికి వస్తే 1999లో ‘పూవెల్లం కేట్టుప్పార్’ సినిమా సమయంలో పరిచయమైన వీరిద్దరి మధ్య మొదట స్నేహం ఏర్పడి, ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఆ తర్వాత ‘ఉయిరిలే కలంతదు’, ‘కాక్క కాక్క’, ‘పెరళగన్’, ‘మాయావి’, ‘జూన్ ఆర్’, ‘సిల్లును ఒరు కాదల్’ వంటి సినిమాల్లో కలిసి కనిపించారు. అలా వరుస సినిమాల్లో కనిపించడంతో వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి అప్పట్లోనే మంచి క్రేజ్ వచ్చింది కూడా.ముఖ్యంగా ‘కాక్క కాక్క’లో పోలీస్ ఆఫీసర్‌గా సూర్య, జ్యోతిక మధ్య కనిపించిన కెమిస్ట్రీ ఎవర గ్రీన్.
సెప్టెంబర్ 11, 2006న చెన్నైలో వివాహం
అలా వారి మధ్య ప్రేమ మొదలై చివరికి సెప్టెంబర్ 11, 2006న చెన్నైలో వివాహంతో ఒక్కటయ్యారు. ఇక ఆ సమయంలో కూడా వీరి పెళ్లి సంప్రదాయ హిందూ పద్ధతిలోనే జరిగింది.. ఇప్పుడు 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఇలా కాస్త వెరైటీగా తమ పెళ్లి రోజును జరుపుకున్నారు. విదేశాల్లోని ఓ చర్చి వేదికగా జరిగిన ఈ వేడుకలో జ్యోతిక తెల్లటి వెడ్డింగ్ గౌన్‌లో కనిపించగా, సూర్య కూడా ఫార్మల్ వెడ్డింగ్ డ్రెస్‌లో తళుక్కు మన్నాడు. ఇక తమ పిల్లలు దియా, దేవ్ లతో పాటు సూర్య సోదరుడు కార్తీ, కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితులు కూడా ఈ సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు.
సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్
మొత్తానికి సోషల్ మీడియాలో వినిపిస్తున్న “మతం మార్చుకున్నారా?” అనే టాపిక్ కంటే 20 ఏళ్ల తర్వాత కూడా ఒకరినొకరు అదే ప్రేమతో చూసుకుంటున్న సూర్య–జ్యోతికల ఈ ‘సీక్వెల్’ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.