Nagarjuna : కింగ్ నాగార్జున కోడలు శోభిత ధూళిపాళ్లపై ప్రశంసలు గుర్తిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. నాగార్జున పెద్ద కోడలు శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) ” వెట్టువం” (vettuvam)అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా ప్రాచీన యుద్ధకళలను చూపించారు. సినిమా కోసం నటీనటులు యుద్ధకళలు నేర్చుకున్నారని తెలియజేస్తూ ఒక చిన్న వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వెట్టువం పై నాగ్ ప్రశంశలు…
తమిళ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది ఇక ఈ సినిమాలో శోభిత పాత్ర మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని ఈ వీడియో చూస్తేనే స్పష్టమవుతుంది. ఇలా శోభిత నటనపై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రశంశల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున(Nagarjuna) సైతం తన కోడలి నటనపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
శోభిత నటన అద్భుతం…
నాగార్జున తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెట్టువం సినిమాకి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..వెట్టువం వీడియో చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాని చూడటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కోసం శోభిత చాలా కష్టపడినట్లు కనిపిస్తుందంటూ కోడలు కష్టం పై మామ ప్రశంసలు కురిపిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో శోభిత రాది అనే పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆర్య, వీ ఆర్ దినేష్ ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కథ మూడు కాలాల నేపథ్యంలో కొనసాగుతుందని తెలుస్తుంది. అదే విధంగా ప్రకృతి విపత్తు భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారని తెలుస్తోంది.
Wow I love the world building!! looks like you put in a lot of work Sobhita … Looks too good😊💐
Waiting for this one!!https://t.co/N9W8IH7BxM
A film by @beemji @officialneelam @LearnNteachprod @Saidevanand3 @mr_saivenkat @arya_offl @vr_dineshravi #SobhitaDhulipala…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 18, 2026
శోభిత కెరియర్ మొదటి నుంచి కూడా ఎంతో విభిన్నమైన సినిమా కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే తమిళం హిందీ సినిమాలలో నటించిన ఈమె ఇప్పటివరకు నేరుగా తెలుగు సినిమాలలో పెద్దగా నటించలేదని తెలుస్తుంది. ఇక శోభిత పెళ్లి తర్వాత ఇదివరకే చీకటిలో అనే ఒక సినిమాలో నటించారు. త్వరలోనే వెట్టువం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక నాగార్జున విషయానికి వస్తే ఆర్ కార్తీక్ దర్శకత్వంలో ఈయన కింగ్ 100 అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 24 వ తేదీ విడుదల కాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ఇదివరకే అధికారికంగా తెలియజేశారు.
Also Read: కత్రినా పై బాడీ షేమింగ్ ట్రోల్స్..సల్మాన్ ఖాన్ ఫైర్ !