E-Paper
Advertisement

హిట్ కొడితే రేటు పెంచేస్తున్న హీరోయిన్లు!

హిట్ కొడితే రేటు పెంచేస్తున్న హీరోయిన్లు!
Advertisement

Heroines Remuneration:ఒకప్పుడు సినిమా రిజినల్ బాషలోనే విడుదలయ్యేది.ఇక పారితోషికాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేది.కాని ఇపుడు ట్రెండ్ మారింది.సినిమా కాస్తా భాషా బ్యారియర్స్ దాటేసి ప్యాన్ ఇండియా ట్యాగ్ వేసుకోవడంతో బడ్జెట్ లు కాస్తా అమాంతం పెరిగిపోయాయి.

ఇక పనిలో పనిగా నటీ నటులు తమ పారితోషికాలని అమాంతం పెంచేశారు.ముఖ్యంగా హీరోలకి దీటుగా హీరోయిన్స్ కూడా తమకున్న క్రేజ్ ని బట్టి, హిట్ సినిమాల ట్రాక్ ని బట్టి ఇపుడు కోట్లలో పారితోషికాలని పుచ్చుకోవడం విశేషం.

Advertisement

రష్మిక మందన్న

వీరిలో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు రష్మిక మందన్న. చలో సినిమాతో పోలో మంటూ టాలీవుడ్ లో అడుగెట్టిన ఈ కన్నడ కస్తూరి పుష్ప: ది రైజ్, యానిమల్ వంటి సినిమాలతో ఒక్కసారిగా టాప్ లీగ్ లోకి వెళ్ళిపోయింది.ముఖ్యంగా పుష్ప వరకి రెండు నుండి మూడు కోట్ల వరకు పారితోషికాన్ని అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత ఒక్కసారిగా రేటు పెంచేసిందట.

Advertisement

సీతారామం,ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలకి మూడు నుండి ఐదు కోట్ల వరకు అందుకున్న రష్మిక పుష్ప2 కి,అలాగే చావాకి ఏకంగా 12 కోట్ల వరకు అందుకుందని సమాచారం.ఇక బాలీవుడ్ లో వచ్చిన కాక్‌టెయిల్ 2 కోసం రష్మిక 15 కోట్లని పుచ్చుకుందట.ఏది ఏమైనా హిట్టు కొట్టిన ప్రతీసారి ఈ భామ రేటు పెంచేసిందన్న విషయం క్లియర్ గా అర్థం అవుతుంది.

సాయిపల్లవి

ఇక రష్మిక తర్వాత ఆ స్థాయిలో పారితోషికం అందుకున్న భామగా సాయిపల్లవి పేరు వినిపిస్తుంది.అయితే గత కొంతకాలం వరకూ దాదాపు 6 కోట్ల పారితోషికం అందుకున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో నితీష్ తివారి దర్శకత్వంలో వస్తున్న రామాయణం సినిమాకి ఊహించని పారితోషికం తీసుకుంటుందని సమాచారం.అవును …రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఏకంగా 20 నుండి 25 కోట్ల వరకు తీసుకుంటుందని తెలుస్తుంది.ఒకరకంగా ఈ ముద్దుగుమ్మ పారితోషికం విషయంలో రష్మికతో పోటీపడుతుందనే చెప్పాలి.

నయనతార

ఇక వీరి తర్వాత పారితోషికాన్ని బాగా డిమాండ్ చేస్తున్న హీరోయిన్లలో వినిపిస్తున్న పేరు నయనతార. సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో చాలాకాలంగా టాప్ లో ఉన్న ఈ తమిళ పొన్ను ఒక్కో సినిమాకి దాదాపు 10 నుండి 12 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఇక సూపర్ హిట్ జవాన్ కి దాదాపు 12 వరకు తీసుకున్న ఈ అమ్మడు ఆ సినిమా ఇచ్చిన ఊపుతో టాక్సిక్ కి ఏకంగా 12 నుండి 15 కోట్ల మధ్యలో తీసుకున్నట్టు తెలుస్తుంది.

త్రిష

ఇక గత రెండు దశాబ్దాల పాటు ఆడియన్స్ ని తనదైన అందం,అభినయంతో అలరిస్తున్న త్రిష కూడా పారితోషికం విషయంలో ఎక్కడా తగ్గట్లేదట.అలా ఒక్కో సినిమాకు దాదాపు 8 నుండి 10 కోట్లని వెనకేస్తుందని టాక్ .ఇక చిరు విశ్వంభరకి ఏకంగా 10 కోట్ల నుండి 12 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

ఈ పారితోషికాలు ఇంకెన్ని పరుగులు తీస్తాయో !

ఇక ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ తో సందడి చేసిన సామ్ ఇపుడు ఒక్కో సినిమాకి దాదాపు 5 కోట్ల వరకు అందుకుంటుందట. అయితే ఈ వెటరన్ బ్యూటీ సినిమాలకి అందుకునే పారితోషికం కన్నా సినిమాలని ప్రొడ్యూస్ చేస్తూ మరిన్ని లాభాలని వెనకేయడం విశేషం.

ఇక సీతారామం సినిమాతో సౌత్‌లో గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ఒక్కో సినిమాకి 4–6 కోట్లు తీసుకుంటే కొత్త తరం హీరోయిన్లలో మమిత బైజు కూడా ఎక్కడా తగ్గకుండా ఒక్కో సినిమాకి రెండు నుండి మూడు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ప్రేమలు తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇపుడు సౌత్ లో మోస్ట్ హైపెనింగ్ హీరోయిన్ గా మారిపోయింది.

ALSO READ :బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. షూటింగ్‌పై క్లారిటీ!

చూడాలి మరి ముందు ముందు ఈ పారితోషికాలు ఇంకెన్ని పరుగులు తీస్తాయో !

Tags

Related News

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన అల్లు అర్జున్ ‘రాకా’!

రూ.46 కోట్లు మోసం… పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కిన హీరోయిన్ రాధ!

టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన యంగ్ హీరో .. ఇప్పుడేం చేస్తున్నారంటే?

‘ది ప్యారడైజ్’ మూవీకి సెన్సార్ షాక్.. మరీ ఇంత వయలెన్స్?

18 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్.. శ్వేత ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?

8గంటలు నీళ్లలోనే.. చెప్పుల్లేకుండా పర్వతోరహణ.. ‘మైసా’ వెనుక రష్మిక కష్టాలు!

ఆధార్ కార్డ్ చూపించి మరీ రియల్ ఏజ్ చెప్పేసిన వైష్ణవి చైతన్య!

“నేను బ్రతికే ఉన్నాను”.. సోషల్ మీడియా ట్రోల్స్ పై నటి వడివుక్కరశి ఆవేదన!

Big Stories

Advertisement
×