Nayanthara: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది నయనతార (Nayanthara). ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు ఎంతమంది వచ్చినా.. తన రేంజ్ డిఫరెంట్ అంటూ నిరూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సీనియర్ హీరోలను మొదలుకొని స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారింది. ఇకపోతే కెరియర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకున్న నయనతార.. విఘ్నేష్ శివన్ (Vighnesh shivan) ను వివాహం చేసుకోక ముందు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభుదేవా (Prabhudeva) తో పెళ్లి పీటల వరకు వెళ్లింది అని, కానీ ప్రభుదేవా పెట్టిన టార్చర్ వల్ల పెళ్లిని ఆపేసుకుందని, అయితే నయనతార వల్లే ప్రభుదేవా తన భార్య రమాకు విడాకులు ఇచ్చారనే వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
విడాకులకు సిద్ధమైన నయనతార..
ఇక ఆ పరిస్థితుల నుండి బయటపడే ఈమె.. గత మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తన అభిమాని అయిన విఘ్నేష్ శివన్ తో ఏడు అడుగులు వేసింది. అంతేకాదు సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక దాంపత్య జీవితంలో అన్యోన్యంగా జీవిస్తూ.. జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్న సమయంలో నయనతార విడాకులు తీసుకోబోతోంది అంటూ ఒక వార్త సంచలనం సృష్టించింది. ముఖ్యంగా నయనతార ఇంస్టాగ్రామ్ స్టోరీలో విడాకుల ప్రస్తావన రావడంతో అందరూ నయనతార విడాకులు తీసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున రెండు రోజుల నుంచి వార్తలు వైరల్ చేస్తున్నారు.
విడాకుల వార్తలకు చెక్ పెట్టిన దంపతులు..
అయితే ఎట్టకేలకు ఈ వార్తలకు చెక్ పెట్టింది నయనతార. తాజాగా తన భర్త విఘ్నేష్, పిల్లలతో కలిసి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తూ ప్రత్యక్షమైంది. పళని స్వామి ఆలయానికి తాజాగా నయనతార దంపతులు వెళ్లారు. అక్కడ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ కనిపించారు. ఇందులో భార్యాభర్తలిద్దరూ చాలా క్లోజ్ గానే కనిపించారు. దీంతో విడాకుల వార్తలకు చెక్ పడినట్లు అయింది. రోజు రోజుకి విడాకుల వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో స్పందించకుండా ఇలా గుడికి వచ్చి దంపతులిద్దరూ తమపై వచ్చిన రూమర్స్ కి క్లారిటీ ఇచ్చారు అంటూ మళ్లీ ఒక కొత్త చర్చ మొదలయ్యింది. మరి ఈ విడాకుల వార్తలు ఎంతవరకు నిజం అనే విషయం తెలియాలి అంటే దీనిపై వీరు స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.
నయనతార సినిమాలు..
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుని నయనతార సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వస్తున్న ‘మెగా 157’ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది. అలాగే గతంలో వచ్చిన ‘అమ్మోరు తల్లి’ సీక్వెల్ ‘అమ్మోరు తల్లి 2’ (మూకుత్తి అమ్మన్ 2) సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సి (Sundar C) దర్శకత్వం వహిస్తున్నారు.
ALSO READ:HHVM: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ ఓపెన్ ఆరోజే!
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==