BigTV English

Konda controversy: కొండా వివాదం.. హైకమాండ్ నిర్ణయం ఏంటి?

Konda controversy: కొండా వివాదం.. హైకమాండ్ నిర్ణయం ఏంటి?

Konda controversy: టీ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి వరంగల్ పంచాయతీ ఇంట్రెస్టింగ్ గా మారింది.. కొండా వర్సెస్ మిగతా వరంగల్ జిల్లా నాయకులు అన్నట్లు మారిన ఈ ఎపిసోడ్ లో ఇరు వర్గాల నాయకులు అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇక ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను పార్టీ అధిస్థానం క్రమశిక్షణ కమిటీకి అప్పగించింది. ఈ సమస్య పరిష్కార మార్గాలను అన్వేషించిన అధిస్థానం ఇప్పటికే ఇద్దరు సభ్యులతో ఒక కమిటీ వేసింది. అయితే సమస్య సద్దుమణుగుతుంది అనుకుంటే కొండా లేఖ దాని తరువాత జరిగిన పరిణామాలతో మరింత ముదిరింది అంటున్నారు పార్టీ నేతలు.


రేవూరి, కడియంలపై కొండా మురళీ అరోపణలు

వరంగల్ జిల్లా పార్టీ మీటింగ్ లో ఎమ్మెల్యే లు రేవూరి , కడియం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు మాజీ ఎమ్మెల్సే కొండా మురళి.. ఆ తర్వాత నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి తదితరులు కొండా ఫ్యామిలీపై పలు ఆరోపణలు చేశారు..ఇదే అంశంపై మీనాక్షీ నటరాజన్ తో మాట్లాడిన నేతలు..పార్టీకి కొండా ఫ్యామిలీ కావాలో, తామంతా కావాలో తేల్చుకోమని అల్టిమేటం జారీ చేశారు.


క్రమ శిక్షణ కమిటీతో భేటీ అయిన కొండా మురళీ

ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సమస్యపై ఏం చేయాలనే అంశంపై క్రమశిక్షణ కమిటీ భేటీ అయి ఇరువురి వాదనలు వినాలని భావించింది. దానిలో భాగంగా గత శనివారం కొండా మురళిని క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్ పిలిచింది. గాంధీ భవన్లో కమిటీతో భేటీ అయిన కొండా మురళీ 6 పేజీలతో ఒక నివేదికను ఇచ్చారు. ఆ నివేదికలో రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై ఫిర్యాదు చేసారు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న ప్రతీ అంశాన్ని ఆ నివేదికలో పేర్కొన్న కొండా, నియోజకవర్గం వారీగా ఏమేం జరుగుతుందనే అంశాలను కమిటీకి తెలిపారు.

ఇందిరకు కడియం చుక్కలు చూపిస

పీసీసీ చీఫ్‌పై అభిమానంతోనే గాంధీ భవన్ వచ్చి జరుగుతున్న విషయాలను వివరించినట్లు కొండా మురళీ తెలిపారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుండి సమస్యలు మొదలయ్యాయని కొండా ఆరోపిస్తున్నారు. కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఇందిరకు చుక్కలు చూపిస్తున్నారని, స్టేషన్ ఘనపూర్లో ఇందిర అనుచరులను కడియం శ్రీహరి టార్చర్ చేస్తున్నాడని కొండా మురళీ ఫిర్యాదు చేశారు. కొండా సురేఖకు, సీతక్కకి గ్యాప్ ఉందని కడియం ప్రచారం చేస్తున్నారని తద్వారా పార్టీలో క్యాడర్ ఇబ్బంది పడుతున్నారని తన నివేదికలో పేర్కొన్నారు.

రేవూరి నిస్వార్ధంగా సహాయం చేశామన్న కొండా మురళీ

ఇక రేవూరికి నిస్వార్ధంగా సహాయం చేశామని, అతనిప్పుడు తమపై గుడుపుటానీ రాజకీయాలు చేస్తున్నట్లు కొండా మురళీ ఆరోపించారు. తమ మద్దతుతోనే రేవూరి గెలిచారని, పరకాల తమ సొంత నియోజకవర్గమని కొండా తెలిపారు. ఇక నాయిని రాజేందర్ పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేస్తున్నట్లు మురళీ అభియోగాలు మోపారు. నాయిని తమ నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నట్లు, తమ నియోజవర్గంలో వేలు పెడుతున్నట్లు ఆరోపించారు. ఇక ఉమ్మడి వరంగల్ ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సతీమణి కొండా సురేఖపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు.

తనను అనవసరంగా రెచ్చగొట్ట వద్దంటున్న కొండా మురళీ

తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు రాజీనామా చేసి వచ్చానని, పార్టీలోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లను తీసుకోవచ్చానని కొండా మురళీ గుర్తు చేశారు. కొంతమంది నేతల లాగా పార్టీ మారి తాను పదవిని ఎంజాయ్ చేయడం లేదని, ఇండియాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీని తానేనని కొండా గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే తనకి గౌరవమని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే తపన తనలో ఉందని మురళీ తెలిపారు. బహిరంగ విమర్శలు చేయడం మంచిదో కాదో తన అంతరాత్మకు తెలుసని, తాను బలహీనుడినా బలవంతున్నో అందరికీ తెలుసని, తనని రెచ్చగొట్టొద్దని తాను పార్టీలో బీసీలను గౌరవించాలని కోరానని, తాను దేనికి భయపడనని, తనకి సీఎం, పీసీసీ చీఫ్ అంటే గౌరవం ఉందని కొండా వివరించారు.

కొండా మురళీ కేసు పరిశీలిస్తున్నామన్న మల్ల రవి

ఇదే రోజు భేటి అనంతరం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మీడియాతో చిట్ చాట్ చేసారు. కొండా మురళీ కేసును ఇప్పుడే పరిశీలిస్తున్నామని ఇది ఆరంభం మాత్రమేనని మల్లు రవి తెలిపారు. తమ కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఉందని తెలిపిన మల్లు రవి కొండా మురళీకి సంబంధించి వస్తున్న ఆరోపణలపై వారం రోజుల్లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఏ ఫిర్యాదులు ఉన్నా తమ కమిటీకి లిఖిత పూర్వకంగా రాసి సంతకాలు పెట్టి ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. అదలా ఉంటే మురళి కి ఇచ్చిన గడువు ముగిసినా ఇప్పటికీ వరకు కొండా దంపతులు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. కానీ మొన్న గురువారం ఎమ్మెల్యే క్వాటర్స్ లో ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి ని కలిసి మరోసారి పన్నెండు పేజీల లేఖలో వరంగల్ నేతలను ఉద్దేశించి చాలా అంశాలు ప్రస్తావించారు. దీని తరువాత వివాదం మరింత ముదిరింది . మరోసారి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు అంతా కలిసి చర్చలు జరిపి అధిష్టానం దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వరంగల్ వివాదంపై రిపోర్ట్ రెడీ చేయాలని మల్లు రవికి ఆదేశం

అదలాఉంటే తెలంగాణ కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీలోకి అంతర్గత విభేదాలకు స్థానిక ఎన్నికల లోపు పరిష్కారం చూపాలని మీనాక్షిని కోరారు. వెంటనే మల్లు రవికి వరంగల్ అంశంపై రిపోర్ట్ తయారు చెయ్యాలని ఆదేశించారు. దీంతో నిన్న ఒకవైపు ఖర్గే మీటింగ్ అవుతుంటే మరోవైపు క్రమశిక్షణ కమిటీ సభ్యుల మీటింగ్ అయింది. మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సోమవారం కొండా మురళి కి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు ఇటీవలే పార్టీ నేతలపై కామెంట్స్ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యేకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

Also Read: దువ్వాడకు వైసీపీ ఝలక్.. టెక్కలి నుండి వాణి

కొండా మురళీ నివేదికపై గుర్రుగా ఉన్న జిల్లా నేతలు

మొత్తానికి కొండా మురళీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన నివేదికపై ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇరువర్గాలకు ఎంత ఎంత నచ్చజెప్పినా వినడం లేదు అంటూ టీపీసీసీ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం..ఇక కొండా ఆరోపణలు, వరంగల్ కాంగ్రెస్ నేతల వ్యవహారంపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×