HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దాదాపు పదేళ్ల నిర్విరామ శ్రమ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి డీసీఎం గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకవైపు తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు అభిమానులను ఖుషీ చేయడానికి తాను సంతకం చేసిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు (Harihara Veera Mallu) మొదటి భాగం జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 14 సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు జూలై 24వ తేదీన రాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులలో ఆద్యంతం అంచనాలు పెంచేసింది.
టికెట్ బుకింగ్స్ ఓపెన్ పై చిత్ర బృందం క్లారిటీ..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక వార్త అభిమానులలో పూర్తి ఎక్సైట్ మెంట్ ను పెంచేసింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరపై చూడాలా అని ఎదురు చూస్తున్న అభిమానులకు అతిపెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. తాజాగా టికెట్ బుకింగ్స్ ఓపెన్ గురించి చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా టికెట్స్ బుకింగ్ జూలై 10వ తేదీ నుంచి ఓపెన్ అవుతాయని చిత్ర బృందం వెల్లడించింది. మొత్తానికైతే మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కానున్న నేపథ్యంలో అభిమానులు ఇప్పుడే టికెట్స్ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా చిత్ర బృందం ఇచ్చిన క్లారిటీతో అభిమానులు కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమా విశేషాలు..
పవన్ కళ్యాణ్ హీరోగా.. నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్ గా రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. మొదటి భాగం ఈ ఏడాది విడుదల కానుండగా.. రెండోభాగంపై ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ రెండవ భాగానికి సంబంధించి ఒక అప్డేట్ తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండవ భాగంలో రాంచరణ్ (Ramcharan ) కీలకపాత్ర పోషిస్తారని, కథను మలుపు తిప్పే పాత్ర కోసం ఆయనను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్.రత్నం (AM Ratnam) నిర్మాణంలో ఈయన వారసుడు జ్యోతి కృష్ణ (Jyoti Krishna)ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఇందులో సత్యరాజ్, సునీల్ తో పాటు పలువురు భారీతారాగణం భాగమైంది.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే.
ALSO READ:SSMB 29 OTT Deal: సినీ చరిత్రలో రాజమౌళి మూవీకి అతిపెద్ద డీల్.. కలలో కూడా ఊహించని నంబర్!