BigTV English
Advertisement

Bigg Boss 9 day 56 : మాధురి ఎలిమినేటెడ్, తనుజ వెన్నుపోటు, హౌస్ లో ఎవరు ఎలాంటివారు

Bigg Boss 9 day 56 : మాధురి ఎలిమినేటెడ్, తనుజ వెన్నుపోటు, హౌస్ లో ఎవరు ఎలాంటివారు

Bigg Boss 9 day 56 : బాహుబలి సాంగ్ తో కింగ్ నాగార్జున ఎంట్రీ. ఎప్పట్లాగానే ఆడియన్స్ నాగార్జునకు పెద్ద అభిమానులమంటూ తెలిపారు. ఆడియన్స్ లో ఒకరు నాకు అన్నమయ్య సినిమా అంటే బాగా ఇష్టం అని చెప్పారు. ఇక నాగార్జున డైరెక్ట్ హౌస్ మేట్స్ తో మాట్లాడుదాం అంటూ మొదలుపెట్టి ముందుగా తనుజాతో కిచెన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడారు.


కిచెన్ డిపార్ట్మెంట్ నాకు వద్దు అని నేను కెప్టెన్ కు చెప్పాను అని తనుజ నాగార్జునతో చెప్పింది. నాగార్జున కెప్టెన్ ఇమ్మానుయేల్ ను ఇదే విషయం అడిగారు నాకు చెప్పలేదు సార్ అని గట్టిగా చెప్పేసాడు. మరోవైపు మాధురి కూడా తన వద్దని చెప్పలేదు సార్ సైలెంట్ గా ఉంది అని క్లారిటీ ఇచ్చేసింది. అక్కడ మాధురి తప్ప ఇంకెవరు లేరు అంటూ చెప్పేసింది.

తనుజ ట్రీట్మెంట్ వేరు 

నీ గురించి చాలామంది కొన్ని కంప్లైంట్స్ రాశారు ఒకటి రెండు మార్కులు జవాబుల రాశారు. ఇంకొంతమంది పెద్ద వ్యాసాలు రాశారు. రేషన్ మేనేజర్ గా చాలా స్ట్రిట్ గా ఉంది అని మాధురి రాసింది అంటూ నాగార్జున చెప్పేసారు. మొత్తానికి నాగార్జున చెప్పినట్లే చెబుతూ నవ్వుతూ చెప్పారు. అందరికీ ఎంత సీరియస్ గా చెప్తారో తెలిసిన విషయమే, కానీ తనుజాకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు.


గర్ల్ ఫ్రెండ్ టీం ఎంట్రీ 

రష్మిక ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో చిత్ర యూనిట్ బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. హౌస్ మేట్స్ ను రష్మికకు పరిచయం చేశారు నాగార్జున. వీరిద్దరూ కలిసి కుబేర సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ హౌస్ లో ప్లే చేశారు. ప్రతిరోజు పండుగ సినిమాలోని సీన్ ఇమ్మానుయేల్ , రీతు, పవన్ కలిసి రిక్రియేట్ చేశారు. వాళ్లు కూడా కొన్ని సినిమాల్లోని సీన్స్ రీ క్రియేట్ చేశారు.

పాయిజన్ డ్రింకింగ్ 

హౌస్ లో కొన్ని పాయిజన్ డ్రింక్స్ పెట్టి ఎవరు ఉంటే మీ గేమ్ కి అడ్డు వస్తుందో వాళ్లతో ఈ పాయిజన్ తాగిపించి వాళ్ళ పేరు చెప్పాలి అని నాగార్జున చెప్పారు. అలా హౌస్ లో ఒకరి మీద ఒకరు వాళ్లకంటే స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళకి పాయిజన్ డ్రింక్ చేయించారు. ముఖ్యంగా ఇమ్మానుయేల్, నిఖిల్ పవన్ కు పాయిజన్ ఇచ్చి తను స్ట్రాంగ్ ప్లేయర్ అతని వల్లనే నా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు. కానీ పవన్ మాత్రం దువ్వాడ మాధురి కు పాయిజన్ ఇచ్చారు.

మాధురి ఎలిమినేషన్ 

నామినేషన్ లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని సేవ్ చేయడం మొదలుపెట్టారు నాగార్జున. చివరగా నామినేషన్ లో దువ్వాడ మాధురి మరియు గౌరవ గుప్తా మిగిలారు. అయితే తక్కువ ఓట్స్ మాధురికి రావడంతో ఎలిమినేషన్ అయిపోయారు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. మాధురిని సేవ్ చేసే పవర్ తనుజ దగ్గర ఉంది. కానీ తనుజ ఆ పవర్ ను మాధురి కోసం యూజ్ చేయలేదు. ఇది ఒక వెన్నుపోటు అని చెప్పాలి. పద్ధతి ప్రకారం మాధురి స్పెషల్ ఏవి ని చూపించారు.

మాధురి ఒపీనియన్స్ 

తనుజ జెన్యూన్ ప్లేయర్ చాలామంది తను యాక్టింగ్ చేస్తుంది అంటారు. కానీ దానిని నేను నమ్మను తను తనలా ఉంది అని చెప్పింది. కళ్యాణ్ హౌస్ లో జన్యున్. ఏ మాస్క్ లేకుండా ఆడుతాడు. భరణి, దివ్య ఫేక్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసింది. తనుజ నువ్వు 100% విన్నావాలే నువ్వు విన్నయితే నేను విన్ అయినట్లే అనుకుంటున్నాను అని మాధురి చెప్పింది.

Also Read: Bigg Boss 9 : అప్పుడు అభిజిత్, ఇప్పుడు పవన్ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తున్న బిగ్ బాస్ యాజమాన్యం

Tags

Related News

Bigg Boss 9 : అప్పుడు అభిజిత్, ఇప్పుడు పవన్ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తున్న బిగ్ బాస్ యాజమాన్యం

Bigg Boss 9 : ఇంక షో ఆపేసి కప్పు ఆవిడకి ఇచ్చేయండి, ఇదేం మేనేజ్మెంట్?

Bigg Boss 9 Promo: తనూజకు గట్టిగా ఇచ్చిపడేసిన కింగ్.. ఇకనైనా మారుతుందా?

Bigg Boss 9: నన్ను ఒక బలి పశువుల వాడుకున్నారు.. బిగ్ బాస్ ను కడిగిపారేసిన దమ్ము శ్రీజ.!

Bigg Boss 9 Promo: హౌస్ లో ది గర్ల్ ఫ్రెండ్.. రీ క్రియేట్ తో ఆకట్టుకున్న కంటెస్టెంట్స్!

Bigg Boss 9 Elimination: ఎలిమినేషన్ లో ట్విస్ట్.. మాధురి అవుట్.. తనూజ పవరాస్త్రా సంగతేంటి?

Bigg Boss 9 : డిమోన్ పై నాగ్ ఫుల్ ఫైర్.. బయటకు వెళ్లిపోమ్మని తలుపులు తెరిచిన బిగ్ బాస్

Big Stories

×