BigTV English
Advertisement

Singer Chinmayi: కర్మ వదిలిపెట్టదు.. జానీ మాస్టర్ పై సింగర్ చిన్మయి సంచలన పోస్ట్!

Singer Chinmayi: కర్మ వదిలిపెట్టదు.. జానీ మాస్టర్ పై సింగర్ చిన్మయి సంచలన పోస్ట్!

Singer Chinmayi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో చిన్మయి(Chinmayi) ఒకరు. ఈమె ప్లే బ్యాక్ సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే ఈమె పట్ల తమిళ చిత్ర పరిశ్రమ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా తమిళ రచయితపై చిన్మయి చేసిన వ్యాఖ్యల పట్ల ఈమెపై నిషేధం విధించారు. అప్పటినుంచి చిన్మయి మహిళల కోసం పోరాడుతూ సోషల్ మీడియాలో ఈమె చేసే పోస్టులు సంచలనంగా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ పోస్టులు కారణంగా చిన్మయి కూడా వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే.


లైంగిక వేధింపులకు మద్దతు తెలపడమే..

ఇకపోతే తాజాగా చిన్మయి ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master), సింగర్ కార్తీక్(Karthik) గురించి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా చిన్మయి తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. “జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ వంటి వాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు తెలపడమేనని, డబ్బును అధికారాన్ని దుర్వినియోగం చేసే వారి చేతుల్లో పెట్టొద్దు.. మనం నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే, కర్మ అసలు వదిలిపెట్టదు” అంటూ ఈమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జైలుకు వెళ్లిన జానీ మాస్టర్..

ఇక సింగర్ కార్తీక్ అలాగే జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక జానీ మాస్టర్ ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అసిస్టెంట్ పట్ల ఈయన లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా పలుసార్లు తనపై దాడి కూడా చేశారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. ప్రస్తుతం ఈయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో వీరిద్దరికీ తిరిగి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కల్పిస్తున్నారు.


ప్రస్తుతం జానీ మాస్టర్ స్టార్ హీరోల సినిమాలకు పని చేస్తూ ఉన్నారు. ఇక సింగర్ కార్తీక్ కూడా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే చిన్మయి ఘాటుగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ పై పలువురు స్పందిస్తూ చిన్మయికి మద్దతుగా నిలువగా, మరి కొందరు ఈమె ట్వీట్ పై విమర్శలు కురిపిస్తున్నారు. మరి చిన్మయి చేసిన ఈ పోస్ట్ పట్ల జానీ మాస్టర్ అలాగే సింగర్ కార్తీక్ ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. మరి ఈ పోస్టుపై వీరిద్దరి స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. జానీ మాస్టర్ స్టార్ హీరోల సినిమాల కోసం పనిచేస్తున్న నేపథ్యంలో ఎంతో మంది నెటిజన్లు కూడా ఈయనపై విమర్శలు కురిపిస్తూ ఒక రే*స్ట్కు అవకాశాలు ఇవ్వడం ఏంటి అంటూ విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read : Tollywood Comedian: డీజేగా మారిన టాలీవుడ్ కమెడియన్.. ఎవరో గుర్తుపట్టారా?

Related News

Suriya46 : వెంకీ అట్లూరి, సూర్య సినిమా ఓటీపీ బిజినెస్ అయిపోయింది, ఎన్నికోట్లో తెలుసా?

Shahrukh Khan: పుట్టినరోజు వేళ నిరాశలో అభిమానులు.. క్షమాపణలు చెప్పిన షారుక్ !

Tollywood Comedian: డీజేగా మారిన టాలీవుడ్ కమెడియన్.. ఎవరో గుర్తుపట్టారా?

Skn : మెగాస్టార్ చిరంజీవి పేరుని ఎలా వాడుకోవాలో చెప్పిన నిర్మాత ఎస్ కే ఎన్

Dhanush : ధనుష్ 55వ సినిమాలో ఆ ప్లాప్ హీరోయిన్, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

HBD Shahrukh Khan: బర్తడే రోజు చిన్న మిస్టేక్.. ట్రోల్స్ ఎదుర్కొంటున్న ‘కింగ్’!

Dhanush : పద్ధతి మార్చుకున్న మారి సెల్వరాజ్, ధనుష్ సినిమా ఎలా ఉండబోతుంది? 

Big Stories

×