Tollywood Comedian: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటుల జీవితకాలం ఎక్కువ కాలం పాటు కొనసాగదని చెప్పాలి. అందుకే వారికి సినిమా అవకాశాలు వచ్చినప్పుడే సెలబ్రెటీలు పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తూ భారీగా సంపాదించుకుంటున్నారు. ఇక కొంతమంది సెలబ్రిటీలకు అవకాశాలు రాక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఇతర వ్యాపారాలను ప్రారంభిస్తూ ఉంటారు. అయితే తాజాగా టాలీవుడ్ కమెడియన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఆశ్చర్యపోవడమే కాకుండా ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా అంటూ ఆయన ఫోటోలను షేర్ చేస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోలందరి సినిమాలలో నటించి కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బబ్లూ( Babloo) ఒకరు. అల్లు అర్జున్ ఆర్య సినిమాలో అల్లు అర్జున్ పక్కనే ఉంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో నటించిన బబ్లూ ప్రస్తుతం డీజేగా మారిపోయారు. తాజాగా ఈయన డీజేకి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన 2006వ సంవత్సరం నుంచి డీజేగా పని చేస్తున్నారని తెలుస్తోంది. అప్పటినుంచి ఒక వైపు డిజే గా కొనసాగుతూనే మరోవైపు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.
ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ బిజీగా ఉన్నా బబ్లు ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం లేకపోలేదు. తన లైఫ్ చాలా హ్యాపీగా ఉందనుకున్న సమయంలోనే కొన్ని కారణాల వల్ల తన కుటుంబ సభ్యులు వరుసగా ఒక్కొక్కరు మరణించడంతో ఈయన పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని, డిప్రెషన్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో తనకు సినిమా అవకాశాలు కూడా రాకుండా ఆగిపోయాయని బబ్లూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
అవకాశం వస్తే నటిస్తారా?
ఇలా సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతోనే ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ డీజేగా మారిపోయారని తెలుస్తోంది. మరి ఇప్పుడైనా ఈయనకు అవకాశాలు వస్తే తిరిగి సినిమాలలో నటిస్తారా లేకుంటే డీజే గానే కొనసాగుతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక బబ్లూ అసలు పేరు సదానంద్. ఈయన ముద్దుల మామయ్య సినిమాతో బాలనటుడుగా తన కెరియర్ ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం సినిమా ద్వారా కమెడియన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆర్య, చిరుత, ఎవడి గోల వాడిది, చిత్రం వంటి సినిమాలలో నటించి బబ్లూ మంచి సక్సెస్ అందుకున్నారు. మరి ఇప్పుడైనా ఈయనకు ఎవరైనా సినిమాలలో అవకాశం కల్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Sreeleela: మాస్ జాతర ఎఫెక్ట్.. ఆ తప్పు చేయనంటున్న శ్రీ లీల.. ఏమైందంటే?