Dhanush : చాలామంది హీరోలు ఎక్కువ టైం ఒక సినిమా చేయడానికి ఈ మధ్యకాలంలో తీసుకుంటున్నారు. ఒక సినిమా హిట్ అయితే, ఇంకో సినిమా చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల వరకు టైం తీసుకుంటున్నారు. కానీ తమిళ్ హీరో ధనుష్ మాత్రం కొంత ప్రత్యేకం అని చెప్పాలి చాలా త్వరగా తన కెరీర్ లో 50 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. ఇంకా ప్రస్తుతం 54వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ధనుష్ కు మంచి మార్కెట్ ఉంది. తను చేసిన సార్ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
ఒకవైపు నటుడుగా అద్భుతమైన సినిమాలు చేస్తూనే మరోవైపు దర్శకుడుగా కూడా సినిమాలు చేస్తున్నాడు ధనుష్. ధనుష్ దర్శకుడుగా చేస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ధనుష్ 55వ సినిమా గురించి కీలకమైన అప్డేట్స్ తెలుస్తున్నాయి.
అమరన్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ కుమార్ పెరియ సామి. ప్రస్తుతం రాజకుమార్ పెరియ సామి ధనుష్ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ధనుష్ కెరియర్ లో వస్తున్న 55వ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫిక్స్ చేశారు
అమరన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రాజకుమార్ పెరియ సామి ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ ఇస్తాడు అని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి సాయి అభియాన్కర్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే డ్యూడ్ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు సాయి.
ఇక ప్రస్తుతం ధనుష్ 54వ సినిమా తుది దశలో ఉంది. సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. ఒక ధనుష్ 55వ సినిమా 2026లో మొదలుకానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది.
మరోవైపు పూజా హెగ్డే సక్సెస్ఫుల్ సినిమా చేసి చాలా ఏళ్లు అవుతుంది. ఒకప్పుడు అరవింద సమేత వీర రాఘవ, అలవైకుంటపురంలో, మహర్షి వంటి సినిమాలతో దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాల్లో భాగమై ఉండేది.
కానీ రీసెంట్ టైమ్స్ లో పూజ నటిస్తున్న సినిమాలేవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కావడం లేదు. అయితే ఈ సినిమాతో అయినా పూజా హెగ్డే కం బ్యాక్ ఇస్తుందేమో ఎదురు చూడాలి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన రెట్రో సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.
Also Read : Mari Selvaraj : పద్ధతి మార్చుకున్న మారి సెల్వరాజ్, ధనుష్ సినిమా ఎలా ఉండబోతుంది?