OTT Movie : తెలంగాణలోని ఓదెల గ్రామంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘ఓదెల రైల్వే స్టేషన్’. వరుస హత్యలతో తిరిగే ఈ కథ క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా ఉంటుంది. నవ వధువులపై అఘాయిత్యాలు, హత్యలతో ఆ ప్రాంతం అట్టుడికిపోతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ తో మొదలయ్యే ట్విస్ట్లు ఆడియన్స్ కి చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తాయి. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా నటించిన ఈ సినిమా షూటింగ్ నిజమైన ఓదెల రైల్వే స్టేషన్‌లోనే జరిగింది. పార్ట్ 2 కూడా ఈ ఏడాది వచ్చి హల్చల్ చేసింది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ఓదెల రైల్వేస్టేషన్’ (Odela Railway Station) 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె. కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకు అశోక్‌తేజ దర్శకత్వం వహించగా, సంపత్ నంది ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలంగాణలోని ఓదెల గ్రామం చాలా చిన్నది. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అక్కడికి అనుదీప్ అనే ట్రైనీ ఐపీఎస్ ఓదెల ఊరికి ట్రైనింగ్ కోసం వస్తాడు. అక్కడి పోలీస్ స్టేషన్‌లో మూడు నెలల పాటు ట్రైనింగ్ కోసం వస్తాడు. అయితే ఈ సమయంలో ఊరిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఊర్లో పెళ్లి జరిగిన తరువాత, శోభనం అయిన తరువాత పెళ్లి కూతురిని కిడ్నాప్ చేస్తుంటాడు. ఇక శోభనం ఎలా జరిగిందని అడుగుతూ ఆమె మీద అఘాయిత్యం చేసి హత్య చేస్తుంటాడు. ఆ సైకోను పట్టుకునేందుకు అనుదీప్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ సైకో చాలా తెలివిగా తప్పించుకుంటాడు.
Read Also : పొలిటీషియన్ అవతారమెత్తే గ్యాంగ్స్టర్… కట్ చేస్తే మెంటల్ మాస్ ట్విస్ట్… ఖతర్నాక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్