Dalit Child Abuse: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దళిత వర్గానికి చెందిన ఓ బాలుడిపై ముగ్గురు టీచర్లు దారుణానికి ఒడిగట్టారు. శారీరకంగా హింసించి, మానసిక క్షోభకు గురి చేశారు. ఈ ఘటనలో బాలుడి తండ్రి ఫిర్యాదుతో స్కూల్ హెడ్ మాస్టర్ సహా ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
సిమ్లా జిల్లాలోని రోహ్రు సబ్ డివిజన్‌లోని ఖద్దపాణి ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న బాలుడిపై దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రధానోపాధ్యాయుడు దేవేంద్ర, ఉపాధ్యాయులు బాబు రామ్, కృతికా ఠాకూర్ తన కొడుకుపై తరచుగా దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడి వల్ల ఆ చిన్నారి చెవిలోంచి రక్తం కారిందని, ఒక సమయంలో చెవి దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు.
Read Also: Cyber Fraud: యూట్యూబర్ హర్ష సాయి పేరుతో ఘరానా మోసం.. జగిత్యాల యువకుడికి సైబర్ వల… రూ. 87,000 స్వాహా!
చదువు నేర్పించాల్సి ఉపాధ్యాయులే దారుణానికి పాల్పడ్డారని తండ్రి ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును పాఠశాల టాయిలెట్‌కు తీసుకెళ్లారని, అక్కడ అతని ప్యాంటులో తేలు పెట్టారని ఆరోపించారు. అక్టోబర్ 30న ప్రధానోపాధ్యాయుడు పిల్లవాడిని పాఠశాల నుండి బహిష్కరిస్తానని బెదిరించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రధానోపాధ్యాయుడు ఆ బాలుడితో “మేము నిన్ను తగలబెడతాము” అని చెప్పాడని తండ్రి ఆరోపించారు. ఆ బాలుడి తండ్రికి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని లేదా ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని హెచ్చరించారు. లేకుంటే ప్రాణం పోగొట్టుకోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు బాలుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బీఎన్ఎస్ నిబంధనల ప్రకారం నిర్బంధం, దాడి, క్రిమినల్ బెదిరింపుల సెక్షన్ల కింద, బాలల పట్ల క్రూరత్వం కింద జువెనైల్ జస్టిస్ చట్టం కింద ముగ్గురు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశారు. బాలుడి బట్టలు విప్పినందుకు ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సెక్షన్లను కూడా విధించారు.