BigTV English
Advertisement

Dhanush : పద్ధతి మార్చుకున్న మారి సెల్వరాజ్, ధనుష్ సినిమా ఎలా ఉండబోతుంది? 

Dhanush : పద్ధతి మార్చుకున్న మారి సెల్వరాజ్, ధనుష్ సినిమా ఎలా ఉండబోతుంది? 

Dhanush : రీసెంట్ గా బైసన్ సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు మారి సెల్వరాజ్. ధ్రువ విక్రమ్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ కూడా వసూలు చేసింది. ముఖ్యంగా మంచి ప్రశంసలు ఈ సినిమా అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో దృవ చేసిన పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.


అయితే మారి సెల్వరాజ్ విషయంలో ఎప్పుడూ ఒక కంప్లైంట్ వినిపిస్తూ ఉంటుంది. తన సినిమాలు ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ గా ఉంటాయని, అధిక వర్గం అణగారిన వర్గం మధ్య కథలు ఎప్పుడు అల్లుతుంటాడని చాలామంది అంటుంటారు. వాస్తవానికి దీని గురించి పలు సందర్భాలలో దర్శకుడు మారి కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే నెక్స్ట్ రాబోయే సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

రూట్ మార్చాడా?

దర్శకుడు మారి సెల్వరాజ్ D56 రచనా శైలి పూర్తిగా మార్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ చాలా దేశాలలో జరుగుతుంది, ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.


మారి సెల్వరాజ్ నుండి రాబోతున్న మొట్టమొదటి చారిత్రాత్మక సినిమా అని కోలీవుడ్ వర్గాల్లో సమాచారం. విజువల్ గా కూడా గ్రాండ్‌గా మరియు హై ఎమోషనల్ గా ఉంటుందని చాలామంది ఊహిస్తున్నారు. ఈ సినిమా కథకు కొన్ని ఇతిహాసాలతో కూడా సంబంధం ఉంది అని తెలుస్తుంది. బాహుబలి సినిమా స్థాయిలో చేయడానికి తమిళ దర్శకులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా అలాంటి ప్రయత్నమే అంటున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌లో ఉంది, లొకేషన్లు, సెట్‌లు మరియు కాస్ట్యూమ్స్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ కెరియర్ కి ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ అని తెలుస్తుంది.

మరో హ్యాట్రిక్ సక్సెస్ 

ఇప్పటివరకు దర్శకుడు మారి సెల్వరాజ్ మొత్తం ఐదు సినిమాలు చేశారు. ఐదు కూడా డీసెంట్ సక్సెస్ సాధించుకున్నాయి. ఇప్పుడు ధనుష్తో చేయబోయే సినిమా సక్సెస్ అయితే వరుసగా రెండు హ్యాట్రిక్ హిట్స్ కొట్టినట్లే.

ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో మారి దర్శకత్వంలో వచ్చిన మామనన్ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాకి ఏ రేంజ్ లో సాంగ్స్ ఇవ్వబోతున్నారు అనే క్యూరియాసిటీ కూడా చాలామందిలో నెలకొంది. ఇప్పటివరకు మారి తీసిన సినిమాలన్నీ ఒకేలా ఉండకపోయినా ఇంచుమించు కాన్సెప్ట్ మాత్రం ఒకే దానిని చెబుతుంది.

Also Read: Ustaad bhagat singh : పవన్ కళ్యాణ్ డాన్స్ ఇరగదీశారు, దేవి ఏమన్నాడంటే?

Related News

Suriya46 : వెంకీ అట్లూరి, సూర్య సినిమా ఓటీపీ బిజినెస్ అయిపోయింది, ఎన్నికోట్లో తెలుసా?

Shahrukh Khan: పుట్టినరోజు వేళ నిరాశలో అభిమానులు.. క్షమాపణలు చెప్పిన షారుక్ !

Singer Chinmayi: కర్మ వదిలిపెట్టదు.. జానీ మాస్టర్ పై సింగర్ చిన్మయి సంచలన పోస్ట్!

Tollywood Comedian: డీజేగా మారిన టాలీవుడ్ కమెడియన్.. ఎవరో గుర్తుపట్టారా?

Skn : మెగాస్టార్ చిరంజీవి పేరుని ఎలా వాడుకోవాలో చెప్పిన నిర్మాత ఎస్ కే ఎన్

Dhanush : ధనుష్ 55వ సినిమాలో ఆ ప్లాప్ హీరోయిన్, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

HBD Shahrukh Khan: బర్తడే రోజు చిన్న మిస్టేక్.. ట్రోల్స్ ఎదుర్కొంటున్న ‘కింగ్’!

Big Stories

×