Skn : గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి పేరు వాడుకుంటున్న కొంతమంది మీద లీగల్ యాక్షన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అలానే దయా అనే ఒక వ్యక్తి మీద కూడా కంప్లైంట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఎవరు మెగాస్టార్ చిరంజీవి పేరుని కించపరచకూడదు అని ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.
అయితే ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి పేరుని కొన్ని రకాలుగా వాడుకున్న అన్ని సంస్థలకు నోటీసులు పంపించారు. అలా చిరంజీవి అనే పేరు మీద ఉన్న హోటల్ కి కూడా నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. స్ట్రీట్ బైట్ అనే యూట్యూబ్ ఛానల్ తో బాగా పాపులర్ అయిన రవితేజ రీసెంట్గా ఒక వీడియోను పోస్ట్ చేసి అసలు ఏం జరిగిందో అనే విషయాన్ని చెప్పారు. అదే పోస్టును షేర్ చేస్తూ ఎస్ కే ఎన్ ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ గురించి చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి అసలైన వ్యక్తిత్వం అంటే ఇదే. ఆయన పేరుని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. కానీ దానిని ఒక మంచి పని కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి అని ఎస్ కే ఎన్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఎస్ కే ఎన్ తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. జర్నలిస్టుగా కెరియర్ స్టార్ట్ చేసిన ఎస్ కే ఎన్ నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ యంగ్ ప్రొడ్యూసర్స్ లో ఒకడు.
This is What #Chiranjeevi garu is for his fans & admirers
Any one can use his name & fame but for good and with good intention only
Forever he is Mana #Chiranjeevi #ManaShankaraVaraPrasadGaru @KChiruTweets https://t.co/2HEH5p8rLr— SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 2, 2025
రవితేజ షేర్ చేసిన వీడియోలో నేను ప్రసాద్ అనే ఫ్రెండు కలిసి చిరంజీవి పేరు మీద హోటల్ స్టార్ట్ చేశాము నల్లగొండలో, మాకు కూడా నోటీసులు వచ్చాయి. అయితే మేము రిక్వెస్ట్ చేసి మా ఉద్దేశం ఏంటో చెప్పాము. తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు రెస్పాండ్ అయితే బాగున్ను అని అనుకున్నాము కానీ ఆయన అంత త్వరగా రెస్పాండ్ అవుతారని అనుకోలేదు.
మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ టీమును పంపించిన తర్వాత మా గురించి తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మా హోటల్ విషయంలో ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. ఇది మెగాస్టార్ చిరంజీవి గారికి చిన్న విషయం కావచ్చు కానీ మాకు ఇది చాలా పెద్ద విషయం.
ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మెగాస్టార్ చిరంజీవి పేరుని మంచి కోసం వాడుకుంటే ఎటువంటి తప్పులేదు దానికి ఉదాహరణమేమి అంటూ రవితేజ ఆ వీడియో షేర్ చేశాడు. పోతే రవితేజ చాలా సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు.
Also Read: Dhanush : ధనుష్ 55వ సినిమాలో ఆ ప్లాప్ హీరోయిన్, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే