HBD Shahrukh Khan: బాలీవుడ్ బాద్ షా గా పేరు సొంతం చేసుకున్న షారుక్ ఖాన్ (Shahrukh Khan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటనతో బాలీవుడ్ లో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ఈరోజు 60 పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈయన నటిస్తున్న ‘కింగ్’ మూవీ నుంచి సాలిడ్ టైటిల్ గ్లింప్స్ ను కింగ్ చిత్ర బృందం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో షారుక్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. ఆయన గెటప్, కొన్ని షాట్స్ పై గట్టి ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఇది చూసిన అభిమానులు పుట్టినరోజు నాడే ఈ ట్రోల్స్ ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.
విషయంలోకి వెళ్తే.. సిద్ధార్థ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం కింగ్. ఈరోజు షారుక్ ఖాన్ పుట్టినరోజు కావడంతో సినిమా నుండి టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. అంతా బాగానే ఉన్నా ఇందులో షారుక్ గెటప్ అలాగే కొన్ని షాట్స్.. ఇటీవల హాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం యఫ్ 1 లోని హీరో బ్రాడ్ పిట్ లుక్కుని షారుక్ తో అచ్చు గుద్దినట్లు దింపేయడంతో ఇప్పుడు ఈ చిత్రానికి కాపీ మరకలు అంటుకున్నాయి. రెండు ఫోటోలు పక్కపక్కన పెట్టి మరీ నెటిజన్లు సోషల్ మీడియాలో మేకర్స్ పై నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు.
ముఖ్యంగా షారుక్ హెయిర్ స్టైల్ కూడా బ్రాడ్ పిట్ ని మ్యాచ్ చేయడంతో సిద్ధార్థ్ మరొకసారి ఇలా అడ్డంగా బుక్ అయిపోయాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇదివరకే ప్రభాస్ సాహా సినిమాలో ఎయిర్ జెట్ సీక్వెన్స్ కూడా పఠాన్ లో షారుక్ తో చేయించడంపై కూడా ఇలాంటి ట్రోల్సే ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు బ్రాడ్ పిట్ ని అచ్చుగుద్దినట్లు దింపేయడంతో అటు డైరెక్టర్ పై ఇటు హీరో పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా పుట్టినరోజు నాడు ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.
also read:Mirai: హిందీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతున్న మిరాయ్.. ఎప్పుడు? ఎక్కడంటే?
Bro, at least give your original look to your puncher-wale fans, not a Hollywood copy 😂 #King pic.twitter.com/Poq5QkUrmx
— ITS VIVEK (@Itsviveksay) November 2, 2025