BigTV English
Advertisement

Tv Serials : డీలా పడ్డ కార్తీక దీపం.. టాప్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు..ఈ వారం రేటింట్స్..?

Tv Serials : డీలా పడ్డ కార్తీక దీపం.. టాప్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు..ఈ వారం రేటింట్స్..?

Tv Serials : తెలుగు బుల్లితెరపై సినిమాలు మాత్రమే కాదు సీరియల్స్ కూడా ప్రసారమవుతూ ఉంటాయి. ఈమధ్య సీరియల్స్ ఒక దానికి మించి మరొకటి పోటీపడి మరి టిఆర్పి రేటింగ్ ను పెంచుకుంటున్నాయి. ఒక ఛానల్ డిఫరెంట్ స్టోరీ తో సీరియల్స్ ని తెరకెక్కిస్తే మరో ఛానల్ అంతకుమించి స్టోరీలతో సీరియల్స్ ని ప్రేక్షకులకు అందిస్తున్నారు.. ముఖ్యంగా స్టార్ మా ఛానల్ ప్రసారమవుతున్న సీరియల్స్ మంచి రేటింగ్ దూసుకుపోతున్నాయి.. ఈ మధ్య వస్తున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు.. గత వారానికి ఏ సీరియల్ టాప్ లో ఉందో ఒకసారి చూసేద్దాం..


కార్తీక దీపం 2..

నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ లీడ్ పాత్రలో నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీకదీపం. ప్రేక్షకుల మనసు దోచుకున్న సీరియల్స్ లో మొదటిగా గుర్తొచ్చే పేరు ఈ సీరియల్. ప్రస్తుతం సీక్వెల్ గా కార్తీకదీపం 2 ప్రసారమవుతుంది. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ చూస్తే.. ప్రస్తుతం ఇదే టాప్ పొజిషన్ లో ఉంది. 14.3 రేటింగ్ తో దూసుపోతుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు..

స్టార్ మా లో ప్రసారమవుతున్న మరో హిట్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కుటుంబంలోని మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ద్వేషాలు ఎలా ఉంటాయో అనేది ఈ సీరియల్ లో చూపించారు. రీసెంట్ గా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. రేటింగ్ విషయంలో అస్సలు తగ్గట్లేదు.. రెండో స్థానంలో కొనసాగుతుంది.. దీని రేటింగ్ విషయానికొస్తే.. తాజాగా 13.48 రేటింగ్ నమోదైంది.


గుండెనిండా గుడిగంటలు..

స్టార్ మా లో ప్రసారం అవుతున్న  మరో సక్సెస్ఫుల్ సీరియల్ గుండెనిండా గుడిగంటలు. బాలు మీనాలా ప్రేమ కథ.. డబ్బుల కోసం ప్రభావతి చేస్తున్న ప్రయోగాలు. మధ్యతరగతి కుటుంబానికి కోటీశ్వరులు కావాలని కొందరి ఆలోచనలు కుటుంబంలో వచ్చే చికాకులను కళ్ళకు కట్టినట్టు చూపించారు.. ఈ మధ్య ఈ సీరియల్ మరోసారి ఇంట్రెస్టింగ్గా మారింది. దాంతో రేటింగ్ కూడా బాగానే పెరుగుతూ వస్తుంది. రేటింగ్ విషయానికి వస్తే.. 13.39 ఉందని తెలుస్తుంది. గత వారంతో పోలిస్తే ఈ వారం భారీగా పెరిగింది.

ఇంటింటి రామాయణం..

స్టార్ మా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్న కుటుంబ కథా సీరియల్స్ లలో ఇంటింటి రామాయణం కూడా ఒకటి.. టైటిల్ కి తగ్గట్లే సీరియల్ లోని పాత్రలు కూడా ఉంటాయి. ఈ సీరియల్ రేటింగ్ లో నాల్గో స్థానంలో కొనసాగుతుంది.. ఆ సీరియల్ కు 12.50 రేటింగ్ వచ్చింది.. అందరు కలిసి పోవడంతో రేటింగ్ కూడా బాగా పెరిగింది..

Also Read: సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవి మస్ట్ వాచ్..

కొత్త సీరియల్స్ ఎక్కువగా టాప్ రేటింగ్ తో దూసుకుపోవడం గమనార్హం.. గత ఏడాదిగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న స్టార్ మా సీరియల్ గుండెనిండా గుడిగంటలు సీరియల్ కాస్త పెరిగింది. అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా రేటింగ్ పెరిగింది. అదే విధంగా కొత్త సీరియల్ నిండు మనసులు సీరియల్ని ఈమధ్య ప్రసారమవుతుంది. నిండు మనుసులు 9.20 రేటింగ్ అందుకుంది. తాజా రేటింగ్స్ లో నిన్ను కోరి 8.50తో ఏడో స్థానానికి దూసుకురావడం విశేషం. 6.56 రేటింగ్ తో నువ్వుంటే నా జతగా సీరియల్ 8వ స్థానంలో.. 7 రేటింగ్తో పలుకే బంగారమాయెనా 9వ స్థానంలో నిలిచింది. కేవలం స్టార్ మా లో మాత్రమే కాదు అటు జెమినీలోనూ, ఇటు జీతెలుగు లోనూ కొత్త సీరియల్స్ ప్రసారమవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Related News

Illu Illalu Pillalu Today Episode: నర్మద కాళ్ళు పట్టుకున్న సాగర్.. శ్రీవల్లి ప్రేమలో చందు.. ధీరజ్ తో ప్రేమ ఛాలెంజ్..

Nindu Noorella Saavasam Serial Today November 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  యమలోకంలో ఆరును చూసి అనుమానించిన నారదుడు

Intinti Ramayanam Today Episode: మీనాక్షికి యాక్సిడెంట్.. అవనిని అవమానించిన పల్లవి.. రాజేశ్వరికి నిజం తెలిసిపోతుందా..?

Brahmamudi Serial Today November 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీకి చుక్కలు చూపిస్తున్న రాజ్‌, కావ్య

GudiGantalu Today episode: మీనా వంటకు ప్రశంసలు.. రోహిణి మాటతో ప్రభావతి షాక్.. సుశీల కోసం బాలు గిఫ్ట్..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవి మస్ట్ వాచ్..

Kissik Talks Vishnu Priya : వేణుస్వామి అలాంటివాడని ఊహించలేదు.. విష్ణు ప్రియా సంచలన వ్యాఖ్యలు!

Big Stories

×