OG Film: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో రాహుల్ యాదవ్ నక్క (Rahul Yadav Nakka) ఒకరు. మళ్లీ రావా (Malli Rava) సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చారు రాహుల్. ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ (agent Sai Srinivasa athreya), మసుద (Masooda), ఇక రీసెంట్ గా బ్రహ్మానందం (Brahmanandam) వంటి సినిమాలను నిర్మించాడు.
ఇప్పటివరకు రాహుల్ యాదవ్ నిర్మించిన నాలుగు సినిమాలు కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి సినిమాలు మాత్రమే తీస్తాడు అని ఈయనకు మంచి పేరు ఉంది. అలానే ఈయన గతంలో నేను తెలుగు సినిమా పరిశ్రమకు అయిదుగురు కొత్త దర్శకులను పరిచయం చేస్తాను అంటూ చెప్పాడు. ఇప్పటికే నలుగురు కొత్త దర్శకులను పరిచయం చేసేసాడు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ఓజి (OG) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మంచి సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా కొత్త రికార్డ్స్ ని కూడా క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తుంది. అయితే ఈ సినిమా టిక్కెట్ కాస్ట్ విషయంలో చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి. ఎవరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు.
వాస్తవానికి సినిమాకి మంచి రిపీట్ వాల్యూ ఉంది. సినిమా టిక్కెట్ రేటు ఎక్కువగా ఉండటం వలన ఇంకొకసారి వెళ్లడానికి కూడా ప్రేక్షకులు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. ఇదే విషయంపైన ఆ సినిమా నిర్మాతలను రాహుల్ యాదవ్ నక్క రిక్వెస్ట్ చేశారు.
ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు “సినిమా రిపీట్ వాల్యూ పెంచడానికి రేపటి నుండి టికెట్ ధరలను 200 కి తగ్గించడం గురించి ఆలోచించాలని #OG నిర్మాత మరియు పంపిణీదారులను నేను కోరుతున్నాను మరియు అభ్యర్థిస్తున్నాను. వెయ్యి రూపాయలు పెట్టి ఇద్దరు చూసే బదులు ఐదుగురు చూస్తారు. వాళ్లు మళ్లీ మళ్లీ చూస్తారు. ఇది ఐదుగురు కలిసి చూసే సినిమా అంటూ ట్విట్టర్ వేదిక పోస్ట్ పెట్టారు.
I urge and request the #OG Producer and distributors to think of reducing the ticket prices to 200 from tomorrow so to increase the repeat value of the Movie.
1K ki iddaru chusey badhalu aidhuguru chustharu, vaallu malli malli chustharu.. Idhi aidhuguru kalisi chusey cinema…!!— Rahul Yadav Nakka (@RahulYadavNakka) September 28, 2025
రాహుల్ యాదవ్ నక్క పోస్టుకు నెటిజన్స్ కూడా అంగీకారం తెలుపుతున్నారు. అలానే ఆయా నిర్మాతలను పోస్టులో మెన్షన్ చేయమని కామెంట్స్ పెడుతున్నారు. టికెట్ రేటు తగ్గిస్తే మళ్లీమళ్లీ చూస్తాం అంటూ కూడా ఈ సినిమాకు సపోర్ట్ వస్తుంది. ఎలానో దసరా సీజన్ దగ్గర పడుతుంది కాబట్టి టిక్కెట్ రేట్లు తగ్గితే ఈ సినిమాకి మరింత మెరుగైన కలెక్షన్స్, అలానే హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా చూడొచ్చు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Kantara Chapter 1 Event : యాంకర్ సుమా పై మరోసారి సీరియస్ అయిపోయిన ఎన్టీఆర్