E-Paper
Advertisement

OTT Movie : ఇంకొకడి కోసం ప్రేమించిన వాడిని నిండా ముంచే అమ్మాయి… కిల్లర్ల గ్యాంగ్ మొత్తం ఒకే చోట… బ్రూటల్ రివేంజ్ డ్రామా

OTT Movie : ఇంకొకడి కోసం ప్రేమించిన వాడిని నిండా ముంచే అమ్మాయి… కిల్లర్ల గ్యాంగ్ మొత్తం ఒకే చోట… బ్రూటల్ రివేంజ్ డ్రామా
Advertisement

OTT Movie : కొరియన్ సినిమాలు డిఫరెంట్ స్టోరీలతో ఆడియన్స్ ని అలరించడానికి వస్తున్నాయి. ఓటీటీలో ఈ సినిమాలకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రీసెంట్ గా ఓటిటిలోకి వచ్చి దూసుకుపోతోంది. ఈ కథ ఒక మాఫియా ప్రపంచంలో, ముగ్గురు వ్యక్తుల ఆధిపత్యం చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో మధ్యలో వచ్చే లవ్ స్టోరీ కావాల్సినంత కిక్ ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘మాంటిస్’ (Mantis) 2023లో వచ్చిన కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. దీనికి లీ టే-సంగ్ దర్శకత్వం వహించారు. 2025 సెప్టెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇందులో ఇమ్ సి-వాన్, పార్క్ గ్యూ-యంగ్, జో వూ-జిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 51 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 5.6/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే 

Advertisement

ఈ కథలో హాన్ వుల్ అనే వ్యక్తికి ‘మాంటిస్’ అనే మారు పేరు ఉంటుంది. ఆ పేరు నేర ప్రపంచంలో బాగా పాపులర్. ఇతను ఒక తెలివైన పెద్ద క్రిమినల్. అతను MK ఎంటర్‌ప్రైజ్ అనే కంపెనీలో పని చేస్తుంటాడు. కానీ ఆ కంపెనీ ఇప్పుడు సమస్యల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ పరిస్థితి దాని బాస్ చా మిన్-గ్యూ చనిపోవడంతో వస్తుంది. హాన్ వుల్ ఒక వెకేషన్ కి వెళ్ళి, తిరిగి వచ్చినప్పుడు ఈ గందరగోళం చూస్తాడు. ఈ సమయంలో అతను తన సొంత మాంటిస్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటాడు. కానీ అతని ముందు రెండు పెద్ద సవాళ్లు ఉంటాయి. మొదటిది అతనితో పాటు శిక్షణ తీసుకున్న జే-యి అనే యువతి. ఆమె ఒకప్పుడు హాన్ వుల్ తో సన్నిహితంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రత్యర్థిగా మారుతుంది. వీళ్లిద్దరి మధ్య ప్రేమ గొడవలు జరుగుతుంటాయి.

ఈ సమయంలో జే-యి స్వోర్డ్‌తో హాన్-వుల్‌ని సవాలు చేస్తుంది. రెండవది డోక్-గో అనే రిటైర్డ్ కి దగ్గరగా ఉన్న క్రిమినల్. అతను హాన్-వుల్, జే-యిలను ఢీ కొడతాడు. ఈ కథ ముందుకు వెళ్తున్న కొద్దీ హాన్-వుల్, జే-యి, డోక్-గో ముగ్గురూ అసాసిన్ ప్రపంచంలో నంబర్ 1 స్థానం కోసం పోటీపడతారు. వీళ్ళ ముగ్గురి మధ్య జరిగే ఫైట్ సీన్స్ చాలా ఉత్కంఠగా ఉంటాయి. హాన్-వుల్ తన కంపెనీని నడపడానికి ప్రయత్నిస్తూనే, జే-యితో తన లవ్ ట్రాక్ ని సరి చేయడానికి పోరాడతాడు. హాన్-వుల్, జే-యి మధ్య ప్రేమ కథ సినిమాకు ఎమోషనల్ టచ్ ఇస్తుంది. చివరికి ఈ మాఫియా రాజ్యంలో ఎవరు నంబర్ 1 స్థానంలో ఉంటారు ? హాన్ వుల్, జే-యి మధ్య ప్రేమ కథ మళ్ళీ చిగురిస్తుందా ? అనే విషయాలను, ఈ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : కొత్త కాపురంలో పాత దెయ్యం … రాత్రయితే వణికిపోయే జంట… ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×