BigTV English

NTR: ఏదేమైనా అరవింద సమేతలో ఉన్నంత సిక్స్ ప్యాక్.. వార్ 2 లో లేదురా..

NTR: ఏదేమైనా అరవింద సమేతలో ఉన్నంత సిక్స్ ప్యాక్..  వార్ 2 లో లేదురా..

NTR: పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే హీరోల్లో మాన్స్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గరనుంచి పాత్ర కోసం ఏది డిమాండ్ చేసినా కూడా దాన్ని మార్చేస్తూ ఉంటాడు. దానికోసం ఎంత కష్టమైనా అస్సలు లెక్కచేయడు.  బాడీని పెంచడం, తగ్గించడం ఎన్టీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చే సమయంలోనే తారక్ కాస్త బొద్దుగానే కనిపించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో మరింత బరువు పెరిగి కనిపించాడు. అయినా కూడా అతని ముఖ కవళికల్లో ఎక్కడ కూడా ఆ కాన్ఫిడెన్స్ తగ్గినట్లు కనిపించేది కాదు.


ఇక రాఖీ సమయంలో ఎన్టీఆర్ రూపంపై ఎన్నో ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే.  దీంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా బరువు తగ్గి కనిపించాడు.  కంత్రి సినిమాలో ఎంత సన్నగా అయితే కనిపించాడో యమదొంగ చిత్రంలో అంత పర్ఫెక్ట్ లుక్ తో కనిపించి షాక్ ఇచ్చాడు. ఇక ఆ సినిమా దగ్గర్నుంచి ఇప్పటివరకు తారక్ ఒక పాత్రకి బరువు పెరుగుతూ ..ఇంకో పాత్రకి బరువు తగ్గుతూ కనిపిస్తున్నాడు. మొన్నటికి మొన్న దేవర సినిమా కోసం దేవర పాత్రకి బరువు పెరిగి.. వరా పాత్రకి బరువు తగ్గి కనిపించాడు.

 


ఇక బరువు మాత్రమే కాకుండా పాత్రకి అవసరమైతే సిక్స్ ప్యాక్ చేయడంలో కూడా ఎన్టీఆర్ ఎక్కడా తగ్గేది లేదు అని చెప్పుకొస్తాడు.  అరవింద సమేతలో ఎన్టీఆర్  సిక్స్ ప్యాక్ చూపించి ఇండస్ట్రీని షేక్ చేశాడు.  తొలిసారి షర్ట్ లేకుండా ఫైట్ చేస్తూ అభిమానులను అలరించాడు. అసలు అరవింద సమేత సినిమా అనగానే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పోస్టర్ .. షర్టు లేకుండా కత్తి చేత్తో పట్టుకొని సీరియస్ లుక్ లో కనిపించే ఎన్టీఆర్. తారక్ కెరీర్ లోనే అలాంటి సినిమా ఇంకొకటి రాదు అని చెప్పొచ్చు.

 

ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు అలాంటి సిక్స్ ప్యాక్ ను ఎన్టీఆర్ ఏ సినిమాలో కూడా చూపించలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ కోసం మరోసారి బరువు పెరిగి కనిపించిన తారక్ అదే బరువుతో దేవరను ఫినిష్ చేశాడు. ఇక దేవర తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం వార్ 2.  హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీ స్టార్లర్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వార్ 2 నుంచి ట్రైలర్ రిలీజ్ చేయగా అందులో ఎన్టీఆర్ మరోసారి సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చి షాక్ ఇచ్చాడు. దాదాపు ఏడేళ్ల తరువాత ఎన్టీఆర్ ఇలా సిక్స్ ప్యాక్ తో కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 

అయితే ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఈసారి అంతగా ప్రేక్షకులను మెప్పించలేదని కొందరు పెదవి విరుస్తున్నారు. ఇదేదో  అతికించినట్లు ఉంది కానీ, పెంచినట్లు లేదని చెప్పుకోస్తున్నారు. ఎన్టీఆర్ బాడీకి, ముఖానికి అస్సలు పొంతన లేకుండా ఉందని అంటున్నారు. వార్ 2 లో ఎన్టీఆర్ లుక్  ఎప్పటి నుంచో తేడా కొడుతోంది అని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సిక్స్  ప్యాక్ కూడా మరింత తేడా కొడుతుందని, ఏదేమైనా అరవింద సమేతలో ఉన్నంత సిక్స్ ప్యాక్.. వార్ 2 లో లేదురా..అనికామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

Related News

OG Trailer: సర్‌ప్రైజ్‌.. ‘ఓజీ’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే!

Deepika Padukone: కల్కి2 నుంచి దీపికా అవుట్.. సందీప్ రెడ్డి రియాక్షన్ చూసారా?

Deepika Padukone: ‘కల్కి 2’ నుంచి దీపికా అవుట్‌.. ఆమెను రీప్లేస్‌ చేసేది ఎవరంటే?

Sudigali Sudheer: పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో.. ప్రియాంక, శివ్ ల పరువు తీసిన సుధీర్

Pawan Kalyan: పవన్‌పై పడి ఏడ్చేవాళ్లంతా.. మళ్లీ ఆయన సినిమాలోనే కనిపిస్తారా?

Movies in Theater : ఈ వారం థియేటర్స్‌లో 8 సినిమాలు.. లాభాలు మాత్రం గుండు సున్నా?

Kalki 2898 AD: ప్రభాస్‌తో ముదిరిన వివాదం… కల్కీ 2 నుంచి దీపికా పదుకొణె అవుట్

Manchu Lakshmi: కుటుంబంలో గొడవలు.. నేను సైలెంట్ గా ఉండడానికి కారణం అదే

Big Stories

×