Nithya Menon:నిత్యా మీనన్.. పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.చూడడానికి పొట్టిగా ఉన్నా.. నటనలో అద్భుతాలు సృష్టించింది. ఏకంగా తన నటనతో నేషనల్ అవార్డులు కూడా సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా పెళ్లి వూసు ఎత్తకపోవడంతో అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు తొలిసారి పెళ్లిపై స్పందించి అందరిని ఆశ్చర్యపడుతుంది. తాను కూడా పెళ్లి చేసుకోవాలని ఏకంగా నాలుగు సార్లు ప్రయత్నం చేశానని, కానీ చివర్లో వెనక్కి తగ్గాను అంటూ చెప్పుకొచ్చింది నిత్యామీనన్.
4సార్లు పెళ్లి వరకు వెళ్లాను.. కట్ చేస్తే..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్ మాట్లాడుతూ.. నేను కూడా వివాహం చేసుకోవాలని 4 సార్లు ప్రయత్నం చేశాను. కానీ చివర్లో వెనక్కి తగ్గాను. ప్రతిసారి లవ్ బ్రేక్ అయింది. ఇప్పుడు వివాహం అనేది నా మొదటి ప్రాధాన్యత కాదు. సామాజిక అంచనాలు, ఒత్తిడి నుండి విముక్తి పొందాను. సాంప్రదాయ ప్రేమ సంబంధాల వెలుపల ఆనందకర జీవితంతో సంతృప్తి చెందుతున్నాను.ముఖ్యంగా ప్రేమ పేరుతో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. అవన్నీ భావోద్వేగంతో కూడుకున్న దెబ్బలు.
ప్రేమించిన ప్రతిసారీ ఎదురుదెబ్బే తగిలింది – నిత్యామీనన్
అయితే ప్రతిసారి ఇలాంటి అనుభవాలు నా ఆలోచనలను మార్చేశాయి. యువత పెళ్లి చేసుకోవాలని చెప్పే పెద్దలను కూడా అర్థం చేసుకోగలను. అయితే దానికి నేను నైతిక ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. ఎప్పుడూ కూడా నేను ఒంటరి వ్యక్తినే. ఒకరితో సమయం గడపడం అనే భావన నాలో ఎప్పుడూ కలగలేదు. నా రిలేషన్ షిప్స్ అన్నీ కూడా విచారకరంగానే ముగిసాయి. ఇక వ్యక్తిగతంగా ప్రేమలో ఎదురు దెబ్బలు తిన్న తర్వాత కూడా నేను ఉందో లేదో తెలియని ప్రేమ గురించి ఇంకా వెతుకుతున్నానా? అనే ఆలోచన కూడా నాలో వచ్చింది ” అంటూ తెలిపింది నిత్యామీనన్.
అమ్మమ్మ పెళ్లి చేసుకోమని టార్చర్ చేసేది – నిత్యామీనన్
వాస్తవానికి నాతో సంబంధంలో ఉన్న భాగస్వామి నన్ను దోపిడీ చేయాలని ప్రయత్నం చేశారు. అటు వివాహం చేసుకునే విషయంలో నాకు ఎటువంటి అత్యవసరం లేదు. నాకు ఒక తోడు దొరికితే తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ నా ఆలోచనలకు మాత్రం వారు మద్దతు ఇస్తూనే ఉన్నారు. అమ్మమ్మ బ్రతికున్నప్పుడు పెళ్లి చేసుకోవాలని చాలా ఒత్తిడి తీసుకొచ్చేది. నాకున్న స్టార్డంతో సంబంధం లేకుండా ఆమె ఆలోచనలు ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని రకాల సామాజిక అంచనాల నుంచి నేను విముక్తి పొందాను. నేను స్వయంగా ఎదగాలి అని, నా ఆలోచనలను నేను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. నా ప్రతి ఆలోచనలను కూడా నా తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు. రతన్ టాటా లాంటి గొప్ప వ్యక్తులే అలాంటి సంబంధాలతో పని లేకుండా ఆనందంగా జీవించారు. ఇప్పుడు నాకు కూడా పెళ్లి ఒక ప్రాధాన్యత కాదు అంటూ నిత్యమీనన్ చెప్పుకొచ్చింది.
ALSO READ:War 2 Story: వార్ 2 స్టోరీ మొత్తం రివీల్.. అసలు విలన్ ఎవరంటే ?