Hero Madhavan : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని ప్రజలు వర్షాల కారణంగా వరదలతో అతలాకుతలమవుతున్నారు.. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ వర్షాలకు వరదలతో కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ఒకవైపు సహాయక చర్యలు జరుగుతున్నా సరే మరోవైపు వరద నీరు ఉపద్రవంలా ఉప్పొంగి వస్తుంది. దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు సామాన్యులు మాత్రమే కాదు.. అటు సెలబ్రిటీలు కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.. తాజాగా తమిళ స్టార్ హీరో మాధవన్ వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
వరదల్లో చిక్కుకున్న హీరో మాధవన్..
భారతదేశం అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా వర్షాలు ఆగకుండా కొనడంతో పలు ప్రాంతాలలో వరదలు ముంచెత్తున్నాయి. వరదల కారణంగా ఎంతోమంది ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు.. తాజాగా ప్రముఖ తమిళ హీరో మాధవన్ వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది.. సినిమా షూటింగ్ కోసం జమ్మూ కాశ్మీర్ లోని లేహలోనే ప్రాంతానికి వెళ్లారు. భారీ వర్షాల కారణంగా అన్ని రవాణా సర్వీసులను నిలిపివేశారు. విమానాలు రద్దు కావడంతో మాధవన్ తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది. 17 ఏళ్ల క్రితం త్రి ఇడియట్స్ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైనా పరిస్థితి కనిపిస్తుందని గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. అది కాస్త వైరల్ అవ్వడంతో ఆయన అభిమానులు హీరోకి ఏమన్నా అయిందేమో అని టెన్షన్ పడుతున్నారు.. తన సమాచారం ప్రకారం ప్రస్తుతం మాధవన్ సేఫ్ గానే ఉన్నట్లు తెలుస్తుంది..
Also Read : జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి కారణం అతనేనా..? అస్సలు ఊహించి ఉండరు..
సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్ చిత్రాలు…
హీరో మాధవన్ గత కొద్దిరోజుల ముందు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన వయసుకు తగ్గట్లు పాత్రలు చేస్తూ సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. స్టార్ హీరో నటిస్తోన్న పాన్ ఇండియా సినిమాలో తండ్రి పాత్ర కూడా పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇదే నిజమైతే? ఓ రకంగా మ్యాడీ అభిమానుల ఫీలయ్యే అవకాశం లేక పోలేదు.. అంత స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా ఆయన ఎంత సింపుల్గా కనిపిస్తుంటాడు. అందుకు ఆయన రజనీకాంత్ ని ఆదర్శంగా తీసుకున్నట్లు గతంలో ఓ సందర్భంలో చెప్పారు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది.. వరదలు తగ్గిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ని తిరిగి మళ్లీ కంటిన్యూ చేయబోతున్నట్లు సమాచారం..