Pawan Kalyan : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీ అయిపోయారు గానీ సినిమాల్లో ఉండి ఉంటే ఈపాటికి నెక్స్ట్ లెవెల్ లో ఉండేవాళ్ళు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ కంప్లీట్ బిజీగా మారారు. రీసెంట్ గా ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధమవుతుంది..
ఈ సినిమా జులై 24న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఎప్పుడో రిలీజ్ కావలసిన సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాలు తర్వాత ఒక సినిమా ప్రెస్ మీట్ కు హాజరయ్యారు.
నేను యాక్సిడెంటల్ యాక్టర్
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పోడియం లేకుండా మాట్లాడడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నగ్నంగా నిలుచున్న ఫీలింగ్ వస్తుంది. నేను యాక్సిడెంటల్ యాక్టర్, అనుకోకుండా యాక్టర్ అయ్యాను. నాకు ఏ గత్యంతరం లేకపోతే ఒక టెక్నీషియన్ గా సెటిల్ అయ్యేవాడిని. సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. సినిమా కోసం పనిచేయడం మాత్రమే తెలుసు. ఇది నా ఫస్ట్ ఇంట్రక్షన్. సినిమా గురించి నేను ఎక్కువగా ప్రమోట్ చేసుకోను. కానీ ఈ పర్టికులర్గా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను.
సినిమా బతకాలి
ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని కూడా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాము అంటే ఫంక్షన్ తర్వాత మళ్లీ మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం నాకు దొరకకపోవచ్చు కాబట్టి. త్రివిక్రమ్ గారు అజ్ఞాతవాసి సినిమాలో రాసిన డైలాగ్. మనం కూర్చునే కుర్చీ వెనక కూడా ఒక మినీ యుద్ధమే ఉంటుంది. అలానే ఒక సినిమా చేయాలి అంటే యుద్ధమే చేయాలి. నేను సినిమాల్లోకి రాకముందు నుంచే ఏం రత్నం గారి లాంటి ప్రొడ్యూసర్ అయితే బాగున్ను అనుకునేవాడిని. ముఖ్యంగా రీజనల్ సినిమాను జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి ఎం రత్నం.