HHVM PressMeet: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చాలా రోజుల తర్వాత అభిమానుల కోసం గ్రాండ్ గా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అందులో భాగంగానే టైం ఇవ్వలేకపోయాను.. నన్ను క్షమించండి అంటూ తన తప్పును ఒప్పుకున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో 2021 లోనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొదలైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా మొదలైన ఈ సినిమా మధ్యలోనే షూటింగ్ ఆగిపోయింది. కరోనా రావడం.. దీనికి తోడు పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా డేట్స్ ఇవ్వకపోవడంతో.. సినిమా సకాలంలో షూటింగ్ కంప్లీట్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తప్పు ఒప్పుకున్న పవన్ కళ్యాణ్..
ఇదిలా ఉండగా తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి.. ప్రెస్ మీట్ నిర్వహించగా.. అందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన తప్పు ఒప్పుకున్నారు. “ఈ సినిమా చాలా పెద్ద సినిమా. నిర్మాత ఏ.ఎం.రత్నం ఎంతో కష్టపడ్డారు. కానీ నేనే డేట్స్ కేటాయించలేకపోయాను” అంటూ తన తప్పు ఒప్పుకున్నారు.
అందుకే క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నారా..?
వాస్తవానికి 2021లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నట్లు అనౌన్స్మెంట్ చేశారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం దర్శకత్వంలో ఈ సినిమా ప్రకటించడం జరిగింది. ఇక అంతా బాగుంది అనుకునే సమయంలో రెండు సార్లు కరోనా కారణంగా సినిమా షూటింగ్లన్నీ వాయిదా పడిపోయాయి. దీంతో ఈ సినిమా కూడా వాయిదా పడింది. అటు పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయిస్తారు అనుకున్న డైరెక్టర్ కి నిరాశ మిగిలింది. ముఖ్యంగా రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయడం వల్ల ఈ సినిమాకి పూర్తిగా డేట్స్ కేటాయించలేకపోయాడు. దీంతో విసిగిపోయిన క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నారు అనే వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
ప్రెస్ మీట్ తోనే హైప్ పెంచిన పవన్ కళ్యాణ్..
ఈ క్రమంలోనే తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇది చాలా పెద్ద సినిమా.. ఈ సినిమాకి డేట్ కేటాయించలేకపోయాను.. తప్పు నాదే అంటూ తప్పును ఒప్పుకున్నారు. మొత్తానికి అయితే తన తప్పు తెలుసుకొని ఇప్పుడు ఈ సినిమా బ్రతకాలి అని, అనాధ కాదు అని, తాను ఉన్నాను అంటూ గ్రాండ్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ సినిమా పై హైప్ పెంచేశారు పవన్ కళ్యాణ్. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ వసూల్ చేస్తుందో చూడాలి.
ALSO READ:Rashmika Mandanna: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన రష్మిక.. మరీ ఈ కొత్త అవతారం ఏంటి తల్లీ!