BigTV English

Flying Taxi: వచ్చే ఏడాది నుంచి ఎగిరే టాక్సీలు.. ఇక ట్రాఫిక్ బాధలే ఉండవు

Flying Taxi: వచ్చే ఏడాది నుంచి ఎగిరే టాక్సీలు.. ఇక ట్రాఫిక్ బాధలే ఉండవు

హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో రోడ్డు ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. ఎప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుంటామో తెలియని పరిస్థితి. ట్రాఫిక్‌లో చిక్కుకుంటే అరగంట ప్రయాణం కూడా రెండు మూడు గంటల పాటు సాగుతుంది. అందుకే మెట్రోలు వచ్చాయి. మెట్రోలు వచ్చినా కూడా ట్రాఫిక్ సమస్య ఇంకా ఎక్కువగానే ఉంది. భవిష్యత్తులో ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఎగిరే టాక్సీలు వచ్చేస్తున్నాయి. మనదేశంలో వస్తున్నాయని ఆశపడకండి.. ప్రస్తుతం దుబాయ్ ఈ ప్రాజెక్టు పై వర్క్ చేస్తోంది. దుబాయిలో వచ్చే ఏడాది నగరాలలో ఎగిరే టాక్సీల సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ.. జాబి ఏవియేషన్ తో కలిసి పని చేస్తోంది. ఈ మధ్యనే టెస్ట్ ఫ్లైట్ ని కూడా విజయవంతంగా పూర్తి చేశారు.


దుబాయ్ లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువే. అందుకే వాటిని తప్పించడం కోసమే ఎగిరే టాక్సీలు రాబోతున్నాయి. ఇలాంటి టాక్సీలు మన భూమి మీద మొట్టమొదటివని చెప్పుకోవాలి. ఒక్కో ట్యాక్సీలో నలుగురు ప్రయాణికులు పట్టేలా వసతి కల్పిస్తున్నారు.

ఎగిరే టాక్సీలలో ఆరు ప్రొఫైల్లర్లు, నాలుగు బ్యాటరీ ప్యాక్‌లు అమర్చి ఉంటాయి. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఇది ఎగురుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది.


ఎంత వేగంతో ప్రయాణిస్తాయి?
ఎయిర్ టాక్సీలు అధిక వేగంతో ప్రయాణిస్తాయి. కాబట్టి గమ్యస్థానాలకు చాలా తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. ఇవి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరుతాయి. పామ్ జుమైరా అనే ప్రాంతానికి వెళ్లడానికి పది నిమిషాల నుండి పావుగంటసేపు సమయాన్ని తీసుకుంటాయి. అదే రోడ్డు ప్రయాణంలో అయితే విమానాశ్రయం నుండి పామ్ జుమైరా అనే ప్రాంతానికి వెళ్లేందుకు 45 నిమిషాల సమయం పడుతుంది.

పర్యావరణహితమైన ట్యాక్సీలు
ఫ్లయింగ్ టాక్సీలు పూర్తిగా విద్యుత్తుతో నడుస్తాయి. కాబట్టి ఇవి పర్యావరణం హితమైనవిగా చెప్పుకుంటారు. ఇక వీటి నుంచి వచ్చే శబ్దం 45 డెసిబుల్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక హెలికాప్టర్ కంటే చాలా తక్కువ శబ్దంతో ప్రయాణిస్తుంది. పర్యావరణంలో కాలుష్య స్థాయిని కూడా తగ్గించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

పైలెట్ ఉండడు
అయితే ఈ టాక్సీలను ఎవరు నడుపుతారు అనే సందేహం వచ్చి ఉండవచ్చు. ఈ టాక్సీలు ఆటోమేటెడ్ సిస్టంతో నడుస్తాయి. ఏఐ ద్వారానే పనిచేస్తాయి. దీనికి ఎలాంటి పైలెట్లు ఉండరు. అయితే ప్రారంభ స్థాయిలో మాత్రం ప్రయాణికుల భద్రతను నిర్ధారించుకోవడానికి ఒక పైలట్ ఉంటారు. ఆ తర్వాత మాత్రం ఇది ఎలాంటి పైలెట్ లేకుండానే నడుస్తుంది.

దుబాయిలో ఫ్లయింగ్ టాక్సీ స్పాట్లను గుర్తించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, డౌన్ టౌన్ దుబాయ్, దుబాయ్ మెరీనా ఫామ్, పామ్ జుమైర్… ఈ నాలుగు ప్రాంతాలకు ఈ ఫ్లయింగ్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

డ్రోన్, హెలికాప్టర్ల మిశ్రమంగా ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీలు పుట్టుకొచ్చాయి. మొదటిలో మాత్రం ఈ ఫ్లయింగ్ టాక్సీల చార్జీలు అధికంగానే ఉండబోతున్నాయని చెబుతోంది దుబాయ్. హై అండ్ క్లయింట్ల కోసమే వీటిని తయారు చేస్తారు. ఆ తరువాత సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తారు. భవిష్యత్తులో రోడ్డు ప్రయాణం కంటే ఈ ఎయిర్ టాక్సీలే అధికంగా దుబాయ్ లో కనిపించబోతున్నాయి.

Related News

Air India Express: స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్.. ప్రయాణికులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపరాఫర్

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Big Stories

×