Pawan Controversy : కొన్నేళ్ళ క్రితం శ్రీ రెడ్డి ఇష్యూలో పవర్ స్టార్ ఫిలిమ్ చాంబర్ కి వెళ్లి కోపంతో ఊగిపోవడం గుర్తుండే ఉంటుంది. అయితే అసలు ఆరోజు ఏం జరిగిందో, ఆ పరిణామాలకి దారి తీసిన పరిస్థితులు ఏంటో వివరిస్తూ అసలు విషయం చెప్పుకొచ్చాడు అప్పటి మా ప్రెసిడెంట్ శివాజీ రాజా. మరింతకీ పవన్ అలా ఎందుకు ఊగిపోయాడో, అలా జరగడానికి గల కారణం ఏంటో శివాజీ రాజా ఏమంటున్నాడో చూద్దాం.
దాదాపు 400కు పైగా సినిమాల్లో
కెరీర్ మొదలెట్టిన రోజుల్లో హీరోగా, ఆ తర్వాత విలన్‌గా, కమెడియన్‌గా దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించిన శివాజీ రాజాకి మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఎలాంటిదో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.అయితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ శ్రీరెడ్డి రోడ్డెక్కిన సమయంలో మాట్లాడుతూ మెగా బ్రదర్స్ తల్లి అంజనమ్మ పై అనరాని మాటలని అనడం తో అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు పవన్.నటి అని చెప్పుకుంటున్న ఒక అమ్మాయి ఇలా భరి తెగించి తన తల్లిని అనరాని మాటలతో తిడుతుంటే కంట్రోల్ చేయాల్సిన మా ప్రెసిడెంట్ సైలెంట్ గా ఉన్నాడని ఫిక్స్ అయ్యాడు పవన్.
also read :అమీర్ ఖాన్ ‘డెత్ నోట్’ రహస్యం…విమానం ఎక్కేముందు ఆ దర్శకుడికి సీక్రెట్ మెసేజ్..
నువ్వు ప్రెసిడెంట్‌గా ఎలా ఉంటావో చూస్తా
దీనితో కోపంగా ‘మా’ ఆఫీసుకే వెళ్లిన పవన్ .. శివాజీ రాజాతో గొడవ పడటమే కాకుండా, “నెక్స్ట్ టైం నువ్వు ప్రెసిడెంట్‌గా ఎలా ఉంటావో చూస్తా” అని అందరి ముందే ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడట. అలా పవన్ ఒక్కసారిగా అంతలా ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడట.అయితే ఆ వార్నింగ్ మాటల వరకే కాకుండా ఏకంగా అన్నట్టుగానే తనని నెక్స్ట్ టైమ్ మా ప్రెసిడెంట్ గా గెలవకుండా చేశారని, దాని కోసం నాగ బాబు తనకి వ్యతిరేఖంగా పావులు కదిపాడని ఆరోజు జరిగిన సంఘటనని గుర్తు చేసుకున్నాడు శివాజీ రాజా.
ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే
నిజానికి జరిగిన ఆ ఇష్యూ లో తానెలాంటి తప్పు చేయలేదని శ్రీరెడ్డి కామెంట్స్ పై అప్పట్లోనే డీజీపీకి కూడా కంప్లైంట్ ఇచ్చామని తెలిపారు.అయితే తమ బ్యాడ్ లక్ ఏంటంటే తాము కంప్లైంట్ ఇచ్చిన విషయం పవన్ కి తెలియదని, ఏర్పడ్డ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే పవన్ ఆ రోజు అలా చేశాడని, ఆ ఫలితంగానే తమ మధ్య దూరం పెరిగిందని మనసులోని మాటని బయట పెట్టేశాడు.
శివాజీ రాజా కెరీర్ విషయానికి వస్తే
ఏది ఏమైనా ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల 30 ఏళ్ల స్నేహానికి బీటలు వారడం బాధాకరమైన విషయమే. ఇక శివాజీ రాజా కెరీర్ విషయానికి వస్తే 1995లో వచ్చిన ‘సిసింద్రీ’తో మంచి క్రేజ్ కొట్టేసిన శివాజీ అదే ఏడు వచ్చిన’ఘటోత్కచుడు’ తో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ముఖ్యంగా 1996లో విడుదలైన పెళ్లిసందడి’ తో అయితే టాలీవుడ్ లో తెగ బిజీ అయిపోయాడు.ఇక ఆ తర్వాత వచ్చిన ‘మొగుడ్స్ పెళ్లామ్స్’తో మరోసారి హీరోగా తన లక్ ని టెస్ట్ చేసుకున్నాడు.ఇక అన్నింటికన్నా మించి 2001లో వచ్చిన ‘అమృతం’ తో మన ఇంటిలో ఒక మెంబర్ అయిపోయాడు.
చూడాలి మరి చాలా ఏళ్ల తర్వాత మనసు విప్పి అసలు విషయం చెప్పిన శివాజీ రాజా ఆ మునుపటి స్నేహాన్ని మళ్ళీ దక్కించుకుంటాడో లేదో !
also read :టాలీవుడ్‌లో పర్సంటేజీ వార్…థియేటర్ల వద్ద ‘జెట్లీ’ బ్రేకులు.. అసలు ఏం జరుగుతోంది?