E-Paper
Advertisement

అమీర్ ఖాన్ ‘డెత్ నోట్’ రహస్యం…విమానం ఎక్కేముందు ఆ దర్శకుడికి సీక్రెట్ మెసేజ్..

అమీర్ ఖాన్ ‘డెత్ నోట్’ రహస్యం…విమానం ఎక్కేముందు ఆ దర్శకుడికి సీక్రెట్ మెసేజ్..
Advertisement

Aamir Commitment : సినిమాపై తనకెంత కమిట్ మెంట్ ఉందో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. తాను ఫ్లైట్ జర్నీ ఎప్పుడు చేసినా ఒక సీక్రెట్ నోట్ తప్పకుండా రాస్తానని, తను ఏ క్షణాన చనిపోయినా, తను చేసే సినిమా ఆగకూడదని ఆ నోట్ సమ్మరీ అంటూ చెప్పిన మాటలు బీటౌన్ లో తెగ హైలెట్ అవుతున్నాయ్.

తాను ఫ్లైట్ జర్నీ లో చనిపోతే

Advertisement

మ్యాటర్ ఏంటో చూస్తే అమీర్ లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకి ఫ్లైట్ జర్నీ అంటే చాలా భయమని, ముఖ్యంగా ఏదైనా సినిమా షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంటే మరింత భయం అవుతుందని మనసులోని మాటని బయటపెట్టాడు. ఒక వేళ గనుక తాను ఫ్లైట్ జర్నీ లో చనిపోతే చేస్తున్న సినిమా ఏమైపోవాలి అనే ఆలోచన నుండే ఈ సీక్రెట్ నోట్ పుట్టింది అంటూ చెప్పుకొచ్చాడు.

also read :డెంటల్ సర్జన్‌తో బ్రేకప్.. డైరెక్టర్‌తో ప్యాచప్..సోషల్ మీడియాను షేక్ చేస్తున్నన్యూస్

Advertisement

అందుకే ఇక విమానం ఎక్కుతాననగా తన సోదరుడు, ప్రముఖ డైరెక్టర్ మన్సూర్ ఖాన్‌కు ఆ నోట్ పంపిస్తానని, ఎలాగైనా ఆ సినిమాని దగ్గరుండి పూర్తీ చేయాలని చెబుతానని తెలిపాడు. మన్సూర్ కి నోట్ పంపడమే కాకుండా ముందే ఆ సినిమా సభ్యులతో మన్సూర్ ఖాన్ తో సినిమా కలిసి కంప్లీట్ చేయాలని చెబుతానంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు అమీర్.

రిలేషన్ విషయానికి వస్తే

అమీర్ – మన్సూర్ మధ్య రిలేషన్ విషయానికి వస్తే వీరిద్దరి కాంబోలో 1988లో వచ్చిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ తోనే అమీర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సినిమా ఎలాంటి కల్ట్ స్టేటస్ కొట్టేసిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు కూడా.

ఆ తర్వాత నాలుగేళ్ళకి అంటే 1992లో వచ్చిన ‘జో జీతా వహీ సికందర్’ సినిమా కూడా సాలిడ్ బ్లాక్ బస్టర్ అయిందే. ఇక 1995లో వచ్చిన ‘అకేలే హమ్ అకేలే తుమ్’ సినిమాకి దర్శకత్వం వహించింది కూడా మన్సూర్ ఖానే. అలా దాదాపు మూడు దశాబ్దాల విడదీయని బంధమే అమీర్ మన్సూర్ ఖానే కావాలని కోరుకొవడానికి కారణం, పైగా వీరిద్దరూ దగ్గరి బందువులు కూడా.

ఇక అమీర్ సినిమా పట్ల ఎంతటి కమిట్ మెంట్ చూపుతాడో ‘లగాన్’ (2001), ‘దంగల్’ (2016) వంటి సినిమాలనే ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు.

మొత్తానికి అమీర్ ఖాన్ కి ఉన్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనే ట్యాగ్ ని మరోసారి ఈ సీక్రెట్ నోట్ తో ప్రూవ్ చేసుకున్నాడన్న మాట!

also read :టాలీవుడ్‌లో పర్సంటేజీ వార్…థియేటర్ల వద్ద ‘జెట్లీ’ బ్రేకులు.. అసలు ఏం జరుగుతోంది?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×