Peddi Day1 Collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జాన్వి కపూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం పెద్ది. క్రేజీ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. నిన్న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ని అందుకున్న పెద్ది కలెక్షన్ల గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనపరుస్తున్నారు. సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరగడంతో కలెక్షన్లు భారీగానే వసూలు అయినట్లు తెలుస్తుంది. అటు ప్రీమియర్ షోలతో పాటుగా, మొదటిరోజు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూల్ చేసిందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..
రామ్ చరణ్ సినిమాలకు డిమాండ్ ఎక్కువ. పెద్ది సినిమాకు కూడా బిజినెస్ భారీగా జరిగింది. జూన్ 3 న ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ షోల ద్వారా బాగానే కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఇండియావైడ్ గా జరిగిన ప్రీమియర్ల ద్వారా ‘పెద్ది ‘ రూ.21 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.. మొత్తం 25 కోట్లు వసూల్ అయ్యాయని తెలుస్తుంది. ఓజీ మూవీ తర్వాత రెండొవ స్థానంలో పెద్ది ఉంది. ఏపీలో రూ. 10కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని తెలుస్తుంది. తెలంగాణాలో రూ 6కోట్లు, కర్ణాటక రూ. 3 కోట్లు మొత్తంగా ఇండియా వైడ్ గా రూ. 21 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది. టోటల్ గా వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి రూ. 38కోట్లు రాబట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల నుంచి 67 కోట్లు, ఓవర్సీస్ లో దాదాపు 30 కోట్లు, ఇండియాలో దాదాపు 80 కోట్లు వసూల్ అయినట్లు తెలుస్తుంది. మొత్తానికి వరల్డ్ వైడ్ గా 110 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది. ఈ కలెక్షన్స్ గురించి అధికారంగా పెద్ది టీమ్ ప్రకటించాల్సి ఉంది.
రామ్ చరణ్ నుంచి భారీ బడ్జెట్ మూవీ పెద్ది.. నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.. జూన్ 4 గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు దేశవ్యాప్తంగా సుమారు 12,412 షోలలో ప్రదర్శించబడింది. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కింది. ఉప్పెన చిత్రానికి 25 కోట్ల బడ్జెట్ తో తీసిన బుచ్చిబాబు పెద్ది మూవీకి 350 కోట్లు పెట్టించడం పై టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు రకాల వార్తలు వినిపించాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా జనాలను మెప్పించింది అని రివ్యూలను చూస్తే అర్థమవుతుంది. 400 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ వచ్చిందనే చెప్పాలి. ఇక రామ్ చరణ్ ఏకంగా రూ.100 కోట్ల రేంజ్‌లో పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మొదటి రోజు దాదాపు 100 కోట్ల టార్గెట్ తో థియేటర్లలో రిలీజ్ అయినయి మూవీ ఇప్పుడు అంతకుమించి వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కలెక్షన్స్ పై పెద్ది టీం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఈ సినిమాకు పోటీగా వేరే సినిమాలు లేకపోవడంతో జనాలు పెద్ధి సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు.. ఈ వీకెండు పెద్ది కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు.