Samantha: సమంత.. మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడు కోలుకున్న తర్వాత ఎక్కువగా ఫిట్నెస్ పై దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నిత్యం జిమ్లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే అలాంటి ఈమె లుక్స్ పై పలువురు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంక మరి కొంతమంది బక్కచిక్కిపోయారు? అనారోగ్యంగా కనిపిస్తున్నారు? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా రోజురోజుకీ కామెంట్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా స్పందించింది సమంత. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్టు పంచుకుంది.
నెటిజన్లకు సమంత సవాల్..
ఈ క్రమంలోనే నెటిజన్లకు ఒక సవాలు విసిరింది. ఆ సవాలు పూర్తి చేయని పక్షంలో తనను ఆ విధంగా ఎవరు కామెంట్ చేయకూడదు అని కూడా తెలిపింది. అసలు విషయంలోకి వెళ్తే.. సమంత తాజాగా తన ఇన్స్టా స్టోరీస్ లో ఒక వీడియో పంచుకుంది. అందులో ఆమె జిమ్లో పుల్ అప్స్ చేస్తూ కనిపించింది. “మనం ఒక డీల్ కుదుర్చుకుందాం.. ఇందులో నేను చూపించిన విధంగా మీరు కనీసం మూడు ఫుల్ అప్స్ చేసేవరకు సన్నబడ్డావ్.. ఆరోగ్యం బాలేదా.. లేదా ఏ ఇతర చెత్త కామెంట్స్ నాపై చేయకూడదు. ఒకవేళ మీరు నేను పెట్టిన చాలెంజ్లో నెగ్గలేకపోతే ఇకపై ఎప్పటికీ కూడా నన్ను ఇలా మాట్లాడకూడదు” అంటూ సమంత రాసుకొచ్చింది.. ప్రస్తుతం సమంత (Samantha)షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాధ భరించలేకపోతున్నా – సమంత
అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా నెటిజన్లు పెట్టే కామెంట్లకు తాను భరించలేకపోతున్నానని.. అందుకే ఇలాంటి ఛాలెంజ్ విసురుతున్నాను అని చెప్పుకొచ్చింది సమంత.
నటిగానే కాదు నిర్మాతగా కూడా భారీ సక్సెస్..
ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న సమంత.. నాగచైతన్య (Naga Chaitanya) నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తోంది. మరొకవైపు కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో కలిసి ‘ఖుషి’ సినిమా చేసి పర్వాలేదు అనిపించుకుంది. ఈ తర్వాత బాలీవుడ్ లో ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు “ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్” అనే బ్యానర్ స్థాపించి ‘శుభం’ సినిమా కూడా నిర్మించింది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో నిర్మాతగా అటు సమంతాకు భారీ సక్సెస్ లభించిందని చెప్పవచ్చు. ఇకపోతే సమంత ఒకవైపు తన పనులు తాను చేసుకుంటూనే.. మరొకవైపు రాజ్ నిడిమోరు (Raj nidimoru)తో ప్రేమలో ఉందనే రూమర్స్ కూడా ఎదుర్కొంటుంది. ఇక దీనిపై క్లారిటీ ఇచ్చి కెరియర్ పై ఫోకస్ పెడుతుందేమో చూడాలి అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు