హర్యానాలో భర్తను మోసం చేస్తున్న భార్య వ్యవహారం బయటపడింది. జింద్ లో ఒక వ్యక్తి తన భార్యను హోటల్ గదిలో మరొక వ్యక్తి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. తన భార్య మీద అనుమానం వచ్చి ఫాలో కావడంతో ఆమె ఓ హోటల్ లో ఇంకో వ్యక్తితో ఉండటాన్ని గమనించాడు. వెంటనే వెళ్లి భార్య రహస్య వ్యవహారాన్ని బయటపెట్టాడు. అంతేకాదు, ఈ తతంగాన్ని సెల్ ఫోన్ లో షూట్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భార్య తీరుపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
జింద్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి, చాలా రోజులుగా భార్యతో వైవాహిక సమస్యలను ఎదుర్కొంటుంది. తనను కాదని వేరొకరితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందని అనుమానిస్తున్నారు. అదే సమయంలో ఆమె తనను హింసిస్తున్నాడంటూ కేసులు పెట్టింది. ఇప్పటికే ఇద్దరి వ్యవహారం కోర్టులో కొనసాగుతోంది. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. ఆమె ఇప్పుడు తల్లి దగ్గరే ఉంటుంది. ఇక భార్య హోటల్ లో ఉందని తెలుసుకుని అతడు నేరుగా హోటల్ కు వెళ్తాడు. హోటల్ గదికి వెళ్లి డోర్ కొట్టగా, చాలా సేపటి ఓపెన్ చేస్తుంది. ఆమెతో మరో వ్యక్తితో కలిసి కనిపిస్తుంది. లోపలికి వెళ్లి భార్యతో పాటు ఆమెతో ఉన్న వ్యక్తి సెల్ ఫోన్ లో షూట్ చేస్తాడు. వారిద్దరిపై గట్టిగట్టిగా అరుస్తాడు.
అటు ఈ ఘటన తర్వాత రాకేష్ తన బాధను వెల్లగక్కాడు. భార్య చర్యల కారణంగా తాను తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు వెల్లడించాడు. జింద్ లోని ఒక ఆసుపత్రిలో మెడికల్ షాపు నడుపుతున్న వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందన్నాడు. ఇద్దరు కలిసి తనను తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రత్నిస్తున్నారని ఆరోపించాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 55 వేలకు పైగా వ్యూస్ అందుకుంది. వీరిలో చాలా మంది భర్త పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఫుటేజీ చూడ్డానికి చాలా బాధాకరంగా ఉందన్నారు. మరికొంత మంది ఇద్దరు వ్యక్తుల ప్రైవేట్ విషయాన్ని బయట పెట్టుకోవడం పట్ల ఇంకొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత వివాదంగా ప్రారంభమైన ఈ గొడవ ఇప్పుడు జింద్ తో పాటు దేశ వ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది.
Read Also: కొండ చివరలో ఆ పని చేస్తుండగా.. జారి లోయలో పడ్డ కారు, స్పాట్ లోనే..