BigTV English

OG Movie: యూట్యూబ్‌లోకి వచ్చేసిన ‘ఓజి’ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్.. ఎంజాయ్ పండుగో!

OG Movie: యూట్యూబ్‌లోకి వచ్చేసిన ‘ఓజి’ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్.. ఎంజాయ్ పండుగో!

OG Movie : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఓజి. సెప్టెంబర్ 25వ తేదీ ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా 300 కోట్ల క్లబ్ లో చేరడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే చిత్ర నిర్మాతలు పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో శుభవార్తను తెలియజేశారు.


యూట్యూబ్ లోకి కిస్ కిస్.. బ్యాంగ్ బ్యాంగ్..

ఈ సినిమాలో “కిస్ కిస్.. బ్యాంగ్ బ్యాంగ్”(Kiss Kiss Bang Bang) అంటూ సాగిపోయే ఒక స్పెషల్ సాంగ్ ను షూట్ చేశారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పాట సినిమాలో ఉంటుందని అభిమానులు భావించారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ పాటను సినిమా నుంచి తొలగించారు. అనంతరం ప్రేక్షకుల కోరిక మేరకు సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత తిరిగి ఈ పాటతో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ పాటను థియేటర్లలో చూడటం మిస్ అయినవారికి నిర్మాతలు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అంటూ సాగిపోయే ఈ పాటను యూట్యూబ్ లో విడుదల చేయడంతో ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నేహా శెట్టి అదిరిపోయే స్టెప్పులు..

ఈ పాటలో తమన్ సంగీతానికి నేహా శెట్టి (Neha Shetty)అద్భుతమైన స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి. ఇక స్పెషల్ సాంగ్ అంటే తప్పకుండా ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తారని అందరూ భావించారు కానీ పవన్ కళ్యాణ్ అలాగే విలన్ ఇమ్రాన్ హష్మీ కూడా ఎక్కడా కనిపించకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ పై ఓ లుక్ వేసేయండి.


ఇక ఓజి సినిమా విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ ప్రియాంక ఆరుళ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా యాక్షన్ మూవీగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ను యాక్షన్ మోడ్ లో చూసి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు హిట్ అందుకొని చాలాకాలం అయింది. ఇలాంటి తరుణంలోనే ఓజి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానుల ఆకలి తీరిపోయిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ సినిమాలు కూడా రాబోతున్నాయని ఇటీవల పవన్ కళ్యాణ్ స్వయంగా ఓజి యూనివర్స్ గురించి కూడా ప్రకటించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓజి2 సినిమా షూటింగ్ పనులు వచ్చే ఏడాది చివరి నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: Kalki 2: నాగ్ అశ్విన్ మూవీలో సాయి పల్లవి.. కల్కి 2లోనా? వేరే మూవీనా? ఇదిగో క్లారిటీ

Related News

Chiranjeevi -Venkatesh: 80’s స్టార్స్ రీయూనియన్.. స్పెషల్ ఫ్లైట్ లో చిరు.. వెంకటేష్!

Sandhya Shantaram: ప్రముఖ నటి కన్నుమూత, బాలీవుడ్ లో అలుముకున్న విషాదఛాయలు

Tollywood: శశివదనే ప్రెస్ మీట్.. క్లైమాక్స్ ట్విస్ట్ కోసమైనా మూవీ చూడాల్సిందే!

Kalki 2: నాగ్ అశ్విన్ మూవీలో సాయి పల్లవి.. కల్కి 2లోనా? వేరే మూవీనా? ఇదిగో క్లారిటీ

Rahul Ramakrishna: ట్రోల్స్ ఎఫెక్ట్… ప్రజా సేవలోకి దిగిన రాహుల్ రామకృష్ణ

Hrithik Roshan: వార్ 2 సినిమాపై ఓపెన్ అయిన హృతిక్.. గాయంలా ఉండాల్సిన పనిలేదంటూ!

Zubeen Garg: ప్రమాదం కాదు.. విషమిచ్చి చంపారు… సింగర్ కేసులో బిగ్ ట్విస్ట్?

Big Stories

×