Raghava Lawrence Helps 1 Lakh to Old Man: నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సేవ కార్యక్రమాలకు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోనూ సూద్ తర్వాత ఆ స్థాయిలో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. ఎప్పుడూ, ఎవరూ ఏ అవసరంలో ఉన్న ముందుకు వచ్చి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎంతోమందికి లారెన్స్ సాయం అందించారు. ది లారెన్స్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవలు అందిస్తున్నారు. పేద విద్యార్థులను చదివించడం నుంచి దివ్వాంగులకు వీల్ చైర్, డబ్బులు సాయం చేయడం, కష్టాల్లో ఉన్న ఫ్యామిలీ ఆర్థిక సాయం అందించి అండగ నిలవడం ఇలా ఎన్నో ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు.
పూరీ గుడిసెలో జీవిస్తున్న దివ్యాంగురాలు శ్వేత అనే యువతికి స్కూటీ కొనిచ్చి ఇచ్చారు. తాజాగా ఆయన వృద్ధ దంపతులకు సాయం చేసేందుకు వచ్చారు. చెన్నైలోని లోకల్ రైల్లో ఇటీవల ఓ హృదయ విదాకరణ సంఘటన వెలుగు చూసింది. 80 ఏళ్ల వృద్ధుడు లోకల్ ట్రెయిన్, రద్ధి ప్రదేశాల్లో స్వీట్స్ విక్రయిస్తు కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రైల్లో స్వీట్స్ విక్రయిస్తున్న అతడిని చూసి ఓ ట్విటర్ యూజర్ ఫోటో తీసి పోస్ట్ చేశాడు. దీనికి “ఈ స్వీట్స్ తయారి వెనుక కన్నీళ్లు, భారమైన ఇద్దరి వృద్ధుల జీవితాలు ఉన్నాయి. 80 ఏళ్ల ఈ వృద్ధుడి కష్టం చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు.
అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తే.. ఆయన కన్న కూతురు లండన్లో నివసిస్తుంది. కానీ, వయసు పైబడిన ఈ తల్లి దండ్రులు భారంగా అనిపించడంతో వారి విడిచిపెట్టింది. ఏ ఆధారం లేక ఈ పెద్దాయన ఇంట్లో తన 70 ఏళ్ల భార్య స్వీట్స్ తయారు చేస్తుంటే.. ఆయన లోకల్ ట్రైయిన్, రద్ది ప్రదేశాల్లో స్వీట్స్ అమ్ముతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈయన కథ ఎంతోమందికి స్ఫూర్తి. కానీ ఈ వయసులో కూడా వారు కష్టపడం చూసి నా గుండె బరువెక్కింది.. దయచేసిన ఈయన కనిపిస్తే స్వీట్స్ కొనండి. లేదా మీకు తోచినంత ఆర్థిక సాయం అందించండి‘ అని సదరు వృద్ధుడు ఓ ప్లకార్డుతో ఉన్న ఫోటో షేర్ చేశారు. ఈ పోస్ట్కి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ ఫోటో నా హృదయాన్ని కదిలిచిందంటూ ఎమోషనల్ అవుతున్నారు.
మరికొంత మంది ప్లకార్డులో ఉన్న అకౌంట్ నెంబర్ కి డబ్బుల పంపించాలని ట్రై చేస్తుంటే అవ్వడం లేదు.. ఈ అకౌంట్పై యూపీఐ క్రియేట్ చేసి పంపించగలరు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ పోస్ట్ కాస్తా.. లారెన్స్ దృష్టికి వెళ్లింది. అది చూసిన ఆయన దీనిపై స్పందించారు. ఈ మేరకు సోషల్ ఆయన ఫోటో షేర్ చేసి ట్వీట్ చేశారు. ‘ఈ రోజే ఈ పోస్ట్ నా కంటపడింది. 80 ఏళ్ల వయసులో కూడా ఈ వృద్ధ దంపతులు ఎవరిపై ఆధారపడకుండ స్వీట్స్ తయారు విక్రయించి జీవనోపాధి పొందుతున్నఈ సంఘటన నన్ను కదిలించింది. వారికి తక్షణమే లక్ష రూపాయలు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్న. కానీ, వారిని ఎలా కలవాలో అర్థం కావడం లేదు. వారి గురించి తెలుసుకునేందుకు ఎన్నో విధాలు ట్రై చేస్తున్నా. కానీ, సాధ్యం కావడం లేదు. వారి వివరాలు తెలిస్తే ప్లీజ్ నాకు తెలియజేయండి. అలాగే ట్రైయిన్ ఎప్పుడైన ఆయన కనిపిస్తే.. స్వీట్స్ కొని ఏ విధంగానైనా వారికి సాయం చేయండి‘ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
Today, A post reached me through social media about an 80 year old man and his wife in Chennai who make sweets and polis, selling them on trains to survive. Their resilience moved me deeply. 🙏
I am ready to contribute ₹1,00,000 to support their journey, hoping it brings them… pic.twitter.com/yRYZj677Ze
— Raghava Lawrence (@offl_Lawrence) September 10, 2025