తెలంగాణలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ నేలలో అడుగడుగునా ఒక్కో దేవతామూర్తి కనిపిస్తాడు. వీటిలో ఓ ప్రత్యేక ప్రత్యేకమైన ఆలయం గురించి తెలుసుకుందాం.. దీనికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. నిత్యం ఎంతో మంది భక్తులు తరలి వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. కోరిన కోర్కెలను నెరవేర్చే స్వామిగా గుర్తింపు తెచ్చకున్నారు. ఇంతకీ ఆ స్వామి పేరేంటి? ఎక్కడ కొలువై ఉన్నాడంటే..
మనం చెప్పుకునే ఆలయం హైదరాబాద్ కు సమీపంలో కొలుదైన అద్భుతమైన శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయం. ఆధ్యాత్మిక వైబ్స్, అద్భుతమైన చరిత్ర, ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. హైదరాబాద్ పరిసరాల్లో ఉండే భక్తులకు ఈ ఆలయం యాక్సెస్ ఈజీగా ఉంటుంది. తెలంగాణలోని పురాతణమైన ఆలయాల్లో ఒకటిగా కొనసాగున్న ఈ ఆలయానికి 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఇది తెలంగాణ కంచి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. చుట్టూ పచ్చని పొలాలు, ప్రశాంతమైన ప్రకృతితో ఇక్కడికి వచ్చే భక్తలుకు తెలియని మానసిక ప్రశాంతత లభిస్తుంది. బయట ఉన్న సరస్సు, లోపల ఉన్న చెరువు దైవిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఈ ఆలయానికి వెళ్లొచ్చు. ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీస్తే ఎంతో అందంగా వస్తాయి. సుందరమైన ఆలయ దృశ్యాలు, పచ్చదనం ఆకట్టుకుంటుంది. కొంత మంది ఈ ఆలయ పరిధిలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకుంటున్నారు. భక్తి, ఫోట్రోగ్రఫీని ఇష్టపడే వారికి ఈల ఆలయం బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
ఇక శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయం తెలంగాణ కంచి ఆలయంగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళనాడులోని ప్రసిద్ధ కాంచీపురం దేవాలయాల శైలిని కలిగి ఉంటుంది. కంచిలో వరదరాజ పెరుమాళ్, ఏకాంబ్రేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారి వంటి పురాతన ఆలయాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇలాంటి ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయం సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం, కొడకంచి గ్రామంలో ఉంటుంది. ఇది హైదరాబాద్ నగరానికి సుమారు 50 కి.మీ. దూరంలో కొలువై ఉంది. ఈ ఆలయం ఏకశిలా నిర్మాణంలో ఉంటుంది. కంచి క్షేత్రంలోని విగ్రహాలు, పూజా విధానాలు, బంగారు-వెండి బల్లి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కొలనులో స్నానం చేసి, బల్లులను స్పర్శించడం వల్ల కంచికి వెళ్లినంత పుణ్యం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో శ్రీదేవీ, భూదేవీ సమేత ఆదినారాయణ స్వామి విగ్రహం ఉంటుంది.
ఇక ఈ ఆలయంల ప్రతి రోజు ఉదయం 6:00 నుంచి సాయంత్రం 8:00 వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒకవేళ హైదరాబాద్ దగ్గరలోని ఆలయానికి వెళ్లాలి అనుకుంది ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. భగవంతుడి ఆశీర్వాదాలు, ప్రకృతి అందాలను తిలకించి వెళ్లొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే అందమైన జ్ఞాపకాల కోసం శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయ దర్శనానికి ప్లాన్ చేసేయండి.
Read Also: కార్వాన్ కాంపెన్ To క్యాంప్ ఫైర్ విత్ తంబోలా.. ఒక్కసారైనా ఈ క్రేజీ ఎక్స్ పీరియెన్స్ చేయాల్సిందే!