Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. రాష్ట్రంలోని సుక్మా జిల్లా గరియాబండ్ లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతిచెందిన వారిలో తెలంగాణ కు చెందిన మొడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. బాలకృష్ణ స్వస్థలం భూపాలపల్లి జిల్లా గణపురం మండలం. గరియాబండ్‌లో కూంబింగ్ ఇంకా కొనసాగుతుందని పోలీస్ అధికారులు వెల్లడించారు.
ALSO READ: Kurnool News: కిరాతక తండ్రి.. 8 నెలల పసిపాపను డ్రమ్ములో ముంచి.. భార్యను దారుణంగా కొట్టి..!