Actor Wife : కొన్ని సందర్భాలలో మరణం అనేది ఎలా సంభవిస్తుందో అనేది ఊహించడం కష్టతరం. ఈ క్షణం మనతో నవ్వుతూ మాట్లాడిన వాళ్ళు మరుక్షణంలో దూరమవుతుంటారు. ఇక ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది నటులు అన్నట్టులు కుటుంబ సభ్యులు అనేది మరణించడం జరుగుతుంది. వయసు మీద పడిన రీత్యా చనిపోయినప్పుడు అంతగా ఆశ్చర్యం అనిపించదు.
కానీ చిన్న చిన్న వ్యాధులకు, కొన్ని ఆహారపు అలవాట్లకు లోనైపోయి ప్రాణాలు కోల్పోవడం అనేది ఊహించని పరిణామం. ఇక అసలు విషయానికి వస్తే మలయాళ నటుడు సాహో ఫేమ్ దేవన్ భార్య చనిపోయిన విషయం తెలిసిందే. అయితే తన భార్య చనిపోవడం వెనక అసలు కారణాన్ని ఆయన బయటపెట్టారు. అతని భార్య ఐస్ క్రీమ్ తిని చనిపోయినట్లు ఆయన చెప్పారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.
ఆమెకు ఉన్న అలర్జీ కారణంగా ఆమెను ఐస్ క్రీం దూరంగా ఉండాలని డాక్టర్లు తెలిపారు. అయితే, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె.. తన కూతరు దాచుకున్న ఐస్ క్రీమ్ తినేశారు. అలా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆవిడ మరణించారు. ప్రస్తుతం దేవన్ మరియు అతని కుటుంబం శోకసముద్రంలో ఉంది.
Also Read : Bigg Boss Sanjana : సంజనా ఓ కట్లపాము.. ఓ నాగుపాము… మూడు రోజుల్లో ఆమెలో ఇది గమనించారా ?